శ్రీవిష్ణును నొక్కేసారా?

ఉన్నది ఒకటే జిందగీలో హీరో రామ్ తో సమానమైన పాత్ర శ్రీవిష్ణుది. ప్రేమదేశం సినిమాలో వినీత్, అబ్బాస్ ల మాదిరిగా. ఇలా రెండు సమానమైన పాత్రలతో సినిమాలు తీయాలనుకున్నపుడు, హీరోలు కాస్త లిబరల్ గా…

ఉన్నది ఒకటే జిందగీలో హీరో రామ్ తో సమానమైన పాత్ర శ్రీవిష్ణుది. ప్రేమదేశం సినిమాలో వినీత్, అబ్బాస్ ల మాదిరిగా. ఇలా రెండు సమానమైన పాత్రలతో సినిమాలు తీయాలనుకున్నపుడు, హీరోలు కాస్త లిబరల్ గా ఆలోచించాలి. జిందగీ సినిమా విడుదలకు ముందే శ్రీ విష్ణు సీన్లు కొన్ని కట్ చేసారన్న వదంతులు వినవచ్చాయి. ఆ సంగతేమో కానీ సినిమా చూసిన తరువాత మాత్రం హీరో పక్కన శ్రీవిష్ణును వీలయినంత తక్కువగా ఎలివేట్ చేసే ప్రయత్నం క్లియర్ గా కనిపిస్తుంది. 

హీరో రామ్ చూస్తే గ్లామరస్ డ్రెస్ ల్లో జిగ్ మని కనిపించేలా వుంటాడు. కానీ శ్రీ విష్ణు కాస్ట్యూమ్స్ చూస్తే డల్ గా వుంటాయి. అదే రామ్ తో సమానంగా శ్రీ విష్ణు గెటప్ ను, డ్రెస్ సెన్స్ ను డిజైన్ చేసి వుంటే..?

సినిమాలో కీలకమైనది ఇద్దరి మధ్య ప్రెండ్ షిఫ్. మరి అలాంటిది తన ప్రెండ్ డల్ గా డ్రెస్ లు వేసుకుంటే ఫ్రెండ్ ఊరుకుంటాడా? డైరక్టర్ కిషోర్ తిరుమల ఈ మాత్రం ఆలోచించలేకపోయారా? లేదా హీరో పక్కన మరెవరు మరీ ఎక్కువ ఎలివేట్ కాకూడదనుకున్నారా? మన సినిమాల్లో ఇది కామన్. అందుకే హీరోయిన్ల పక్కన లావుగా వున్న కమెడియన్లను ఫ్రెండ్స్ గా పెడతారు. ఈ సంకుచిత భావం వున్నవాళ్లు, ఇలాంటి అధ్భుతమైన స్నేహాల సినిమాలు తలకెత్తుకోకూడాదు. 

ఏమాటకు ఆ మాట, ఇన్ని హర్డిల్స్ మధ్య కూడా శ్రీవిష్ణు బాగానే పెర్ ఫార్మ్ చేసాననిపించుకున్నాడు.