చాలామందికి డేటింగ్ అంటే సెక్స్ అనే భావన ఉంది. కానీ డేటింగ్ లో సెక్స్ అనేది ఓ భాగం మాత్రమే. పరస్పరం అర్థం చేసుకునే క్రమంలో సెక్స్ కూడా అందులో చేరిందన్నమాట. అయితే రానురాను శృంగారానికే ప్రాధాన్యం పెరగడంతో డేటింగ్ కు అర్థం మారిపోయింది. కానీ సెక్స్ లేకుండా డేటింగ్ చేస్తే సత్ఫలితాలు వస్తాయంటున్నారు నిపుణులు.
సెక్స్ లేకుండా డేటింగ్ చేస్తే భాగస్వామిని ఎంచుకోవడంలో సరైన నిర్ణయం తీసుకునే అవకాశముందని అంటున్నారు. మరీ ముఖ్యంగా డేటింగ్ లో సెక్స్ ను మిక్స్ చేయకపోతే ఎదుటి వ్యక్తి ఎంత నిజాయితీగా ఉన్నాడో అర్థమౌతుందట.
ఒకవేళ డేటింగ్ లో భాగంగా శృంగారాన్ని కూడా ఎంజాయ్ చేస్తే.. అధిక భాగం ఆలోచనలు ఆ దిశగా వెళ్లిపోయి.. అభిరుచులు, ఆలోచనలు, మైండ్ సెట్ పై భాగస్వామితో ఓ అవగాహనకు రావడం కష్టమంటున్నారు నిపుణులు. మాట్లాడి చర్చించుకోవాల్సిన ఎన్నో విషయాలు మరిచిపోతామట.
మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. డేటింగ్ తర్వాత దురదృష్టవశాత్తూ విడిపోవాల్సి వస్తే సెక్స్ చేసిన వాళ్లు ఎక్కువ ఇబ్బందులు పడతారని, అదే శృంగారం లేకుండా డేటింగ్ చేసి విడిపోతే ఫ్రెండ్స్ గా కొనసాగే అవకాశాలు ఉన్నాయంటున్నారు.