జెంటిల్‌మేన్, నిన్ను కోరి చిత్రాలతో వరుసగా విజయాలు అందుకుని తెలుగు చిత్ర సీమలోకి ఎంట్రీ ఇచ్చిన నివేదా థామస్‌కి నటిగా మంచి పేరు వచ్చింది. అయితే స్టార్ హీరోల సరసన సూట్ కాదనే ముద్ర పడిపోయింది. జై లవకుశలో ఎన్టీఆర్‌తో నటించినా కానీ గ్లామరస్ క్యారెక్టర్ కాకపోవడంతో ఆమెకి అంతగా గుర్తింపు రాలేదు.
ఆ చిత్రం యావరేజ్‌గా ఆడడంతో నివేదకి భారీ చిత్రాల్లో ఆఫర్లు రావడం లేదు. దీంతో ట్రెడిషినల్‌గా కనిపించే తన లుక్స్ మార్చుకుని స్టయిలిష్‌గా కనిపించేందుకు నివేద కృషి చేస్తోంది. నిత్యామీనన్‌లా ఎంత పేరు వచ్చినా ఎక్కువ సినిమాలు చేయకుండా పోకుండా, ముందుగానే తన లోటుపాట్లు తెలుసుకుని వ్యవహరిస్తోంది.
చిన్న సినిమాల్లో ఎంత బిజీ అయినా కానీ స్టార్ హీరోల సినిమాల్లో గ్లామరస్‌గా కనిపించగలిగితేనే ఏ హీరోయిన్‌కి అయినా లెంగ్తీ కెరీర్ వుంటుంది. సమంత, అనుష్క మాదిరిగా ఈ బ్యాలెన్స్ చూసుకున్న వాళ్లే టాప్ స్టార్లు అయ్యారిక్కడ. ఈ ప్రయత్నంలో నివేద ఎంతవరకు సక్సెస్ అవుతుందనేది చూడాలి.