లై సినిమాతో నిర్మాతను కోలుకోలేని దెబ్బ తీసాడు దర్శకుడు హను రాఘవపూడి. నితిన్ స్టామినా చూసుకోకుండా ముఫై అయిదు నుంచి నలభై కోట్లు ఖర్చుచేయించేసాడు. సినిమా సంతకెళ్లి నిర్మాతకు నష్టాలు మిగిలాయి. మళ్లీ హనుకు ఇప్పట్లో ఎవ్వరూ చాన్స్ ఇవ్వడం కష్టం ఏమో అనుకుంటే, నేనున్నానని ఆదుకుంటున్నాడు హీరో శర్వానంద్.
శర్వానంద్ తీసుకున్న అడ్వాన్స్ లు, చేయాల్సిన సినిమాలు వున్నాయి కానీ ప్రస్తుతానికి అయితే సెట్ మీద ఏ సినిమా లేదు. సుధీర్ వర్మతో సినిమా చేయడానికి ఎక్కువ చాన్స్ వుంది. సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మిస్తుందీ సినిమాను.
ఆ సినిమా క్యాన్సిల్ అయితే, దీంతో పాటో ఒప్పుకున్న సినిమా మరోటి వుంది. బాహుబలి లాంటి భారీ సినిమా నిర్మాతలు నిర్మించే దర్శకుడు రాఘవేంద్రరావు తనయుడు ప్రకాష్ డైరక్షన్ చేయాల్సిన సినిమా. ఆ సినిమాను ఇప్పుడు శర్వానంద్ క్యాన్సిల్ చేసుకున్నట్లు తెలుస్తోంది. దాని ప్లేస్ లోనే హను రాఘవపూడి లైన్ ను ఓకె చేసినట్లు తెలుస్తోంది.