గౌతమ్ నందా ఆశించన ఫలితం ఇవ్వక, ఆరడుగుల బుల్లెట్ విడుదల కాక, ఆక్సిజన్ వాయిదాల మీద వాయిదాలు పడుతూ వుండడంతో, హీరో గోపీచంద్ కెరీర్ కాస్త ఇబ్బందుల్లోనే వుంది. ఇలాంటి టైమ్ లో ఒక కొత్త సినిమా ఓకే చేసాడు. చక్రి అనే కొత్త దర్శకుడు ఈ సినిమాకు పనిచేయబోతున్నాడు.
వాస్తవానికి బెంగాల్ టైగర్ సినిమా నిర్మించిన రాధామోహన్ తన ఫ్రెండ్లీ డైరక్టర్ సంపత్ నందితో కలిసి గోపీచంద్ సినిమా ప్లాన్ చేసారు. మరి ఇప్పుడు ఏమయిందో, నిర్మాత ఆయనే కానీ, డైరక్టర్ మారారు.
సంపత్ నందితో కూడా గోపీచంద్ వేరే నిర్మాతకు ఓ సినిమా చేసే అవకాశం వుందని తెలుస్తోంది. అతి త్వరలో ఈ సినిమా సెట్ మీదకు వెళ్తుంది. మిగిలిన నటులు, సాంకేతిక బృందం ఎంపికకావాల్సి వుంది.