‘వీరగ్రంథం’ వెనుక స్కెచ్ వేసిందెవరో?

రాంగోపాల్ వర్మ తీయదలచుకున్న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ అనేదే ఒక స్కెచ్ ప్రకారం విడుదల అయిన ప్రకటన. కొన్ని సంకుచిత ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకుని రాంగోపాల్ వర్మ ఆ ప్రాజెక్టును ప్రకటించారు. అలాంటి ప్రకటన ద్వారా..…

రాంగోపాల్ వర్మ తీయదలచుకున్న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ అనేదే ఒక స్కెచ్ ప్రకారం విడుదల అయిన ప్రకటన. కొన్ని సంకుచిత ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకుని రాంగోపాల్ వర్మ ఆ ప్రాజెక్టును ప్రకటించారు. అలాంటి ప్రకటన ద్వారా.. ఆయన ‘ఏదో’ అవుతుందనుకున్నారు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే.. స్కెచ్ అనేది ఆయన ఒక్కరికే చేతనయ్యే విద్య కాదు. అందుకే ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రానికి కౌంటర్ స్కెచ్ గా ‘లక్ష్మీస్ వీరగ్రంథం’ తెరమీదకు వచ్చింది.

ఇప్పుడు చర్చ కొద్దిగా పక్కకు మళ్లింది. ఇన్నాళ్లూ బాలయ్య-తేజ కాంబినేషన్లోని  ఎన్టీఆర్ బయోపిక్ కు , మొన్నటిదాకా లక్ష్మీస్ ఎన్టీఆర్ పేరు వినిపించింది. ఇప్పుడు కాస్తా.. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ కు పోటీగా ’లక్ష్మీస్ వీరగ్రంథం’ పేరు మాత్రమే వినిపిస్తోంది. సమఉజ్జీలుగా ఈ రెండు చిత్రాలు మాత్రమే బరిలో ఉన్నాయి. అంటే ఎన్టీఆర్ బయోపిక్ అనేది… మరో రేంజికి చెందిన చిత్రంగా ఇప్పుడు పరిగణనలో ఉన్నట్లే లెక్క. 

ఇప్పుడిక అసలు విషయానికి వద్దాం. వర్మ చిత్రం వల్ల అంతో ఇంతో లాభం జరిగింది ఎన్టీఆర్ బయోపిక్ చిత్రానికే. వీరగ్రంథం చిత్రానికి స్కెచ్ కూడా ఆ యాంగిల్ లోంచే నడిచినట్లుగా విశ్వసనీయంగా తెలుస్తోంది. 

లక్ష్మీస్ వీరగ్రంథం చిత్రానికి దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి. ఆయన దర్వకత్వంలో ఈ చిత్రం రూపొందేలా ప్రకటన రావడం వెనుక వ్యూహం మాత్రం దర్శకుడు తేజ ది అనే గుసగుసలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. కేతిరెడ్డి- తేజ మధ్య విభేదాలు ఉన్నట్లుగా, గతంలో తగాదా పడ్డట్టుగా ఒక ప్రచారం ఉంది. అయితే వీరిద్దరి మధ్య మంచి సంబంధాలే ఉన్నాయని కొందరు అంటున్నారు.

గతంలో కేతిరెడ్డి దర్శకత్వం వహించిన ఒక చిత్రానికి తేజ కెమెరామెన్ గా కూడా పనిచేశాడని అంటున్నారు. ఆ సత్సంబంధాలను తేజ ఈ రకంగా ఉపయోగించుకున్నారని భోగట్టా. ఆయన కీ తిప్పి.. కేతిరెడ్డి ద్వారా పావులు కదపడంతో.. మొత్తానికి లక్ష్మీస్ వీరగ్రంథం ప్రకటన వచ్చింది. 

అంతా అనుకున్నట్లే జరుగుతోంది. ఇన్నాళ్లూ తేజ చిత్రానికి వర్మ చిత్రానికి పోటీ కట్టి.. వ్యాఖ్యానాలు చేసిన వాళ్లంతా ఇప్పుడు.. వర్మ చిత్రానికి – కేతిరెడ్డి చిత్రానికి పోలిక తెస్తూ కామెంట్లు విసురుతున్నారు. మరి బాలయ్య – తేజ కాంబినేషన్లోని బయోపిక్ సేఫ్ జోన్ లోకి వెళ్లినట్టే కదా!