కెరీర్ స్టార్టింగ్ లో కత్రినా కైఫ్ కు మంచి బూస్టప్ ఇచ్చాడు సల్మాన్ ఖాన్. ఆమె స్టార్ హీరోయిన్ గా ఎదగడానికి కారణం కండల వీరుడే. తర్వాత వీళ్లిద్దరి మధ్య తేడా వచ్చింది. ఆ తర్వాత రణబీర్ కపూర్ కు దగ్గరైంది కత్రినా. ఇప్పుడా బంధం కూడా తెగిపోయింది. ప్రస్తుతానికి సోలో లైఫ్ ఎంజాయ్ చేస్తున్న కత్రినాకైఫ్.. మరోసారి సల్మాన్ కు దగ్గరైనట్టు వార్తలు వస్తున్నాయి.
ప్రస్తుతం వీళ్లిద్దరూ కలిసి “టైగర్ జిందా హై” అనే సినిమా చేస్తున్నారు. ఈ మూవీ టైమ్ లోనే సల్మాన్-కత్రినా పరస్పరం దగ్గరయ్యారు. వాళ్లిద్దరి సాన్నిహిత్యం తెలిసేలా ఆమధ్య కొన్ని ఫొటోలు కూడా విడుదలయ్యాయి. ఈ నేపథ్యంలో తన నెక్ట్స్ సినిమాకు కూడా కత్రినానే రిపీట్ చేయాలని సల్మాన్ నిర్ణయించడం ఆసక్తికరంగా మారింది.
టైగర్ జిందా హై తర్వాత అలీ అబ్బాస్ దర్శకత్వంలో భారత్ అనే సినిమా చేసేందుకు అంగీకరించాడు సల్మాన్. వచ్చే ఏడాది రంజాన్ కు ఈ మూవీని రిలీజ్ చేయబోతున్నారు. సల్మాన్ బావ అతుల్ అగ్నిహోత్రి నిర్మించనున్న ఈ సినిమాలో కూడా కత్రినానే హీరోయిన్.
అటు కత్రినాకైఫ్ కూడా సల్మాన్ తోనే ఎక్కువగా ఉండేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తోంది. ఇకపై అతడి సినిమాలకు కాదనకుండా కాల్షీట్లు ఇవ్వాలని నిర్ణయించుకుంది. మరోవైపు వీళ్లిద్దరి కాంబోలో ఓ యాడ్ కూడా రాబోతోంది. ఇవన్నీ చూస్తుంటే సల్మాన్-కత్రినా మరోసారి దగ్గరైనట్టు భావిస్తోంది బాలీవుడ్.