త్వరలోనే తేజ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు వెంకటేశ్. సురేష్ ప్రొడక్షన్స్, ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్లపై రాబోతున్న ఈ సినిమాకు ఓ వెరైటీ టైటిల్ పెట్టినట్టు ప్రచారం సాగుతోంది. ప్రేక్షకులందరికీ బాగా పరిచయమైన ఆ పేరు “ఈ నగరానికి ఏమైంది”. ఇప్పుడిదే టైటిల్ ను వెంకీ సినిమాకు ఫిక్స్ చేశారంటూ ప్రచారం సాగుతోంది.
సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ టైటిల్ రిజిస్టర్ అవ్వడంతో ఈ పుకార్లకు మరింత ఆస్కారం ఏర్పడింది. బాలయ్యతో తేజ చేయబోయే ఎన్టీఆర్ బయోపిక్ కంటే ముందే వెంకీ సినిమా స్టార్ట్ కానుంది. ఈ మూవీలో వెంకీ కాలేజ్ ప్రొఫెసర్ పాత్రలో కనిపించబోతున్నాడట. వచ్చే నెల 16న ప్రారంభంకానున్న ఈ సినిమాకు, తాజా టైటిల్ కు సంబంధం ఏంటనేది ఇంట్రెస్టింగ్ గా మారింది.
అయితే ఇదే బ్యానర్ పై ప్రస్తుతం పెళ్లిచూపులు దర్శకుడు తరుణ్ భాస్కర్ ఓ సినిమా చేస్తున్నాడు. మరో 2 చిన్న సినిమాలు కూడా పైప్ లైన్లో ఉన్నాయి. సో.. వెంకీ సినిమాకే ఈ టైటిల్ పెడతారనే గ్యారెంటీ లేదు.