మెల్లమెల్లగా యూ-టర్న్ తీసుకుంటున్నాడు సునీల్. హీరోగా నటిస్తున్న సినిమాల సంఖ్య తగ్గిస్తూ, మళ్లీ కమెడియన్ పాత్రల వైపు షిఫ్ట్ అవుతున్నాడు. కాకపోతే ఈసారి కేవలం కామెడీ అని ఫిక్స్ అవ్వడం లేదు. క్యారెక్టర్ రోల్స్ కూడా చేయబోతున్నాడు. ఇందులో భాగంగా సునీల్ కోసం అతడి బెస్ట్ ఫ్రెండ్ త్రివిక్రమ్ ఓ అద్భుతమైన పాత్ర సృష్టించినట్టు తెలుస్తోంది.
ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ ఓ కొత్త సినిమా ప్రారంభించిన విషయం తెలిసిందే. కంప్లీట్ ఫ్యామిలీ ఎమోషన్స్ తో రాబోతున్న ఈ సినిమాలో సునీల్ కోసం కూడా ఓ క్యారెక్టర్ రాస్తున్నాడట త్రివిక్రమ్. ఎన్టీఆర్ తో చేయబోయే ఈ సినిమాతో సునీల్ కెరీర్ ఓ కొత్త మలుపు తీసుకోనుందట. అంత పవర్ ఫుల్ క్యారెక్టర్ అని తెలుస్తోంది.
ఎన్టీఆర్ తో చేయబోయే సినిమా కంటే ముందు చిరంజీవి 151వ సినిమా సైరా నరసింహారెడ్డిలో ఓ కీలక పాత్ర పోషించడానికి ఒప్పుకున్నాడు సునీల్. కాకపోతే సైరా కంటే ముందు ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమానే థియేటర్లలోకి వస్తుంది. సో.. కమెడియన్ గా సునీల్ కు రీఎంట్రీ మూవీ ఎన్టీఆర్ సినిమానే కానుంది. ఫిబ్రవరి నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఉంటుంది.