రాజా ది గ్రేట్ తో రవితేజలో ఓ కొత్త ఉత్సాహం వచ్చింది. సినిమాకు సక్సెస్ టాక్ రావడంతో ఇక అదే ఊపును కొనసాగించాలని ఫిక్స్ అయ్యాడు. కానీ చేతిలో ఉన్న సినిమాలు చూస్తే మళ్లీ ఫ్లాప్ వస్తుందేమోనని భయపడుతున్నాడు. దీనికి కారణం 'టచ్ చేసి చూడు'.
ఈ మూవీపై మొదట్నుంచి రవితేజకు అనుమానంగానే ఉంది. అందుకే ఒకేసారి స్టార్ట్ చేసినప్పటికీ టచ్ చేసి చూడు ప్రాజెక్టును పక్కనపెట్టి రాజా ది గ్రేట్ ను ముందుగా థియేటర్లలోకి వదిలాడు. కానీ ఇప్పుడు 'టచ్ చేసి చూడు' సినిమాను విడుదల చేయాల్సిన పరిస్థితి. అదే కనుక జరిగితే మరోసారి ఫ్లాప్ చూడాల్సి వస్తుందని భయపడుతున్నాడు రవితేజ.
పోనీ ఈ సినిమాను పక్కనపెడదామంటే మరోసారి గ్యాప్ వచ్చేస్తుందని భయం. పోనీ ధైర్యం చేసి గ్యాప్ తీసుకుందామన్నా చేతిలో శ్రీనువైట్ల ప్రాజెక్టు మాత్రమే ఉంది. వైట్లపై నమ్మకంతో గ్యాప్ తీసుకోవడమంటే అంతకంటే పెద్ద రిస్క్ ఇంకోటి ఉండదు.
మరోవైపు తమిళ సినిమా బోగన్ ను తెలుగులో రీమేక్ చేసేందుకు రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కానీ ఇది సెట్స్ పైకి రావడానికి టైం ఉంది. దీంతో ఎటూ తేల్చుకోలేకపోతున్నాడు రవితేజ.