పవన్-త్రివిక్రమ్ ల జంట యూనిట్ సమేతంగా విదేశాలకు బయల్దేరుతోంది. అజ్ఞాతవాసి సినిమా కోసం సుమారు మూడు వారాల పాటు బల్గేరియా, ఆ చుట్టుపక్కల దేశాల్లో షూట్ చేసేందుకు యూనిట్ మొత్తం బయల్దేరుతోంది. ఈ మూడు వారాల షూటింగ్ తో అజ్ఞాత వాసి షూట్ వర్క్ పూర్తవుతుంది. ఈ మూడు వారాల లెంగ్తీ షెడ్యూలులో రెండు పాటలతో పాటు ఓ భారీ ఛేజ్, కొన్ని సీక్వెన్స్ లు, ఒకటి రెండు ఫైట్లు కూడా చిత్రీకరిస్తారు.
అజ్ఞాతవాసికి సంబంధించినంత వరకు ఇది కాస్త భారీ షెడ్యూలే. ఆర్టిస్ట్ లు , కాంబినేషన్లు, ఖర్చు ఇలా అన్ని విధాలా అన్నమాట. ఈ షెడ్యూలు నవంబర్ 17 నాటికి పూర్తయితే, అనుకున్నట్లు సాగితే, ఇక పోస్ట్ ప్రోడక్షన్ మాత్రమే వుంటుంది. అప్పటికి ఇంకా నెల మీద పది హేను రోజులు సమయం వుంటుంది కాబట్టి, పోస్ట్ ప్రొడక్షన్ కు పెద్దగా టెన్షన్ వుండదు.
త్రివిక్రమ్ టేకింగ్ లో దాదాపు మూడున్నర గంటల వరకు వస్తోందని, దాన్ని రెండున్నర గంటల కుదించాల్సి వుంటుందని తెలుస్తోంది. పైగా 150కోట్ల బిజినెస్ చేసుకుంటున్న భారీ సినిమా కనుక, పోస్ట్ ప్రొడక్షన్ కూడా ఆ లెవెల్లోన వుండే అవకాశం వుంది. అందువల్ల నెల పదిహేను రోజుల టైమ్ అవసరమే.