రవితేజ @ 13 కోట్లు?

రాజా ది గ్రేట్ విడుదల తరువాత హీరో రవితేజ మళ్లీ ఫుల్ ఫామ్ లోకి వచ్చేసాడు. దాదాపు రెండేళ్లుగా సరైన సినిమా లేదు. అలాంటి టైమ్ లో రాజా ది గ్రేట్ వచ్చింది. సినిమా…

రాజా ది గ్రేట్ విడుదల తరువాత హీరో రవితేజ మళ్లీ ఫుల్ ఫామ్ లోకి వచ్చేసాడు. దాదాపు రెండేళ్లుగా సరైన సినిమా లేదు. అలాంటి టైమ్ లో రాజా ది గ్రేట్ వచ్చింది. సినిమా టాక్, కలెక్షన్లు ఇవన్నీ పక్కన పెడితే, రవితేజలో మళ్లీ మునపటి జోష్ కనిపించిందని, కామెడీ టైమింగ్, డైలాగ్ టైమింగ్ అదిరాయని అభిమానులు, జనం ఫీలయిన మాట వాస్తవం. 

దీంతో ఇప్పుడు రవితేజ రేటు పెరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికి రవితేజ ఒక్క సినిమా మాత్రమే ఓకే చేసాడు. నల్లమలపు బుజ్జితో కలిసి ఓ సినిమా చేస్తున్నాడు. దాని తరువాత ఇంకా పక్కాగా ఏ సినిమా అన్నది ఫిక్స్ కాలేదు. ఎన్ఆర్ఐ ప్రొడ్యూసర్లతో ఓ తమిళ రీమెక్ కు ఓకె అన్నాడు. అడ్వాన్స్ తీసుకున్నాడు అని వినికిడి. కానీ రెమ్యూనిరేషన్ ఫైనల్ కాలేదు. 

మరో పక్క మైత్రీ మూవీస్ ఓ సినిమా నిర్మించే ఆలోచనలో వుంది. ఇక రవితేజతోనే నిర్మాతగా తన ప్రయాణం మొదలు పెట్టిన బండ్లగణేష్ కూడా డేట్స్ కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి నేపథ్యంలో రవితేజ తన రెమ్యూనిరేషన్ పెంచే ఆలోచనలో వున్నట్లు కనిపిస్తోందని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం పది కోట్ల రేంజ్ లో వున్న రవితేజ రెమ్యూనిరేషన్ 13కు పెరగబోతోందని తెలుస్తోంది.

రవితేజ సినిమాలకు హిందీ డబ్బింగ్ కు మంచి డిమాండ్ నే వుంది. రాజా ది గ్రేట్ కు 7కోట్లు ఆ ఆదాయమే వచ్చింది. తెలుగు శాటిలైట్ 11కోట్ల వరకు వచ్చింది. మరి డిజిటల్ ఆదాయమే 18కోట్ల వరకు వున్నందున, రవితేజ తన రేటు పెంచడంతో పెద్దగా ఆశ్చర్యం ఏమీ లేదేమో?