నాని + కిషోర్ తిరుమల = చిత్రలహరి

నాని సినిమాల లైనూ లెంగ్తూ భలేగా వుంటోంది. ఒక్కో సినిమా ఒక్కో తరహా. అలాగే టైటిళ్లు కూడా. పైగా అలా అని లేటు వుండదు. ప్రతి మూడు, నాలుగు నెలలకు ఓ సినిమా వచ్చేయాల్సిందే.…

నాని సినిమాల లైనూ లెంగ్తూ భలేగా వుంటోంది. ఒక్కో సినిమా ఒక్కో తరహా. అలాగే టైటిళ్లు కూడా. పైగా అలా అని లేటు వుండదు. ప్రతి మూడు, నాలుగు నెలలకు ఓ సినిమా వచ్చేయాల్సిందే. ప్రస్తుతం ఎమ్ సిఎ సినిమా చేస్తున్నాడు. ఆ తరువాత ఇంకో సిన్మా ప్లానింగ్ లో వుంది. ఆ సినిమా కూడా అ.. అనో, అలాంటిదే మరోటో టైటిల్ వినిపిస్తోంది. 

ఈ సంగతి అలా వుంటే, మైత్రీ మూవీస్ లో ఓ సినిమా చేయాలని ఫిక్సయ్యాడు. సెన్సిటివ్ డైరక్టర్ కిషోర్ తిరుమల డైరక్టర్. ఈ సినిమా జనవరి లేదా ఫిబ్రవరిలో ప్రారంభమై, పోస్ట్ సమ్మర్ కు రెడీ అవుతుంది. ఈ సినిమాకు కూడా భలే చిత్రమైన టైటిల్ ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగు నాట దూరదర్శన్ వచ్చిన కొత్తలో పిచ్చ పాపులర్ అయిన పదం అది. చిత్రలహరి.

ఇప్పుడు దీన్నే టైటిల్ గా అనుకుంటున్నట్లు తెలుస్తోంది. అప్పట్లో వారం వారం చిత్రలహరి వస్తోంది అంటే చాలు జనాలు టీవీకి అంటుకుపోయేవారు. అలాంటి క్యాచీ టైటిల్ ను ఇప్పటి దాకా ఎవరూ టచ్ చేయలేదు. అందుకే నానికి దొరికేసినట్లుంది.