ప్రవీణ్ సత్తారు పేరు వింటే, ఇప్పటి దాకా వచ్చిన ఒకటి రెండు చిన్న సినిమాలు మాత్రమే గుర్తుకు వస్తాయి. అలాంటిది ఒక్కసారిగా మాంచి యాక్షన్ ఫిల్మ్ ట్రయిలర్ కట్ చేసి వదిలాడు. చాలా కాలంగా స్క్రీన్ కు దూరంగా వున్న రాజశేఖర్ తో గరుడవేగ సినిమా స్టార్ట్ చేసినపుడు, ఏదో చేస్తున్నాడులే అనుకున్నారు. సినిమా కోసం కాస్త భారీగా ఖర్చు చేసేస్తూ వుంటే, రాజశేఖర్ మీద 16 నుంచి 17కోట్లు ఖర్చేమిటీ? అనుకున్నారు.
కానీ ఇప్పుడు ట్రయిలర్ బయటకు వచ్చిన తరువాత ఖర్చు క్లియర్ గా కనిపిస్తోంది. సబ్జెక్ట్ ఏమిటి అన్నది తెలియకపోయినా, యాక్షన్ సీక్వెన్స్ లు, ఛేజ్ లు వగైరా చూస్తుంటే ప్రవీణ్ సత్తారుకు ఈ జోనర్ లో కూడా మంచి టాలెంట్ నే వున్నట్లుంది అనిపించేలా వుంది.
నిజం చెప్పాలంటే ట్రయిలర్ చూసిన తరువాత ఇండస్ట్రీలో వినిపించిన కామెంట్ ఒక్కటే. ఇంత హెవీ వర్క్, ఖర్చు, అంతా చూస్తుంటే, రాజశేఖర్ కాకుండా మరే హీరోనయినా తీసుకుని వుండాల్సింది అని. కానీ ప్రవీణ్ సత్తారు చిన్న సినిమాలు చూసి, ఏ కమర్షియల్ హీరో డేట్లు ఇస్తారు? ఇప్పడు ఈ ట్రయిలర్ చూసాక నమ్మకం పెట్టుకోవచ్చు. ట్రయిలర్ లో కూడా అంతా బాగుంది. రాజశేఖర్ ను ఎంత తక్కువ చూపించాలో, అంతే చూపించడం చూస్తుంటే, తన సినిమాలో ఏది ప్రొజెక్టు చేయాలో? ఏది తక్కువ చేయాలో, ప్రవీణ్ గ్రహించేసినట్లుంది.