వర్మ ఎన్టీఆర్ రెడీ అంట

ఇప్పడు గోల, హడావుడి అంతా ఎన్టీఆర్ బయోపిక్ దే. బాలయ్య నిర్మించే బయోపిక్ వ్యవహారం సైలంట్ గా సాగుతుంటే, దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిర్మించే బయోపిక్ వ్యవహారం నానా రచ్చ అవుతోంది. అయితే…

ఇప్పడు గోల, హడావుడి అంతా ఎన్టీఆర్ బయోపిక్ దే. బాలయ్య నిర్మించే బయోపిక్ వ్యవహారం సైలంట్ గా సాగుతుంటే, దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిర్మించే బయోపిక్ వ్యవహారం నానా రచ్చ అవుతోంది. అయితే లెటెస్ట్ విషయం ఏమిటంటే, వర్మ చిత్రంలో ఎన్టీఆర్ గా నటించడానికి ఒక కొత్త నటుడు ఎంపిక అయిపోయాడట.

వర్మ స్వయంగా ఈ విషయాన్ని ఓ ఇంటర్వూలో చెప్పేసాడు. కొత్త నటుడిని ఎంపిక చేసానని, శిక్షణ పొందుతున్నాడని వెల్లడించాడు. వర్మ భలే చిత్రమైన మనిషే. ఎప్పడు బయోపిక్ గురించి అనుకున్నాడో? ఎప్పుడు ఎన్టీఆర్ లాంటి కొత్త నటుడని పట్టేసుకున్నాడో? అప్పుడే ట్రయినింగ్ కు పంపేసాడు. 

కానీ సినిమా వచ్చే ఏడాది అక్టోబర్ నాటికి కానీ రెడీ కాదని కూడా వర్మ వెల్లడించాడు. నిజానికి వర్మకు ఓ సినిమా తీయడానికి అంత టైమ్ అక్కరలేదు. ఇప్పుడు అనుకుంటే, మరో మూడు నెలల్లో సినిమా తీసి చేతిలో పెట్టగలడు. కానీ మరి ఎన్నికలు వచ్చే ఏడాది ఆఖరుకు వస్తాయని అనుకుంటున్న నేపథ్యంలో వర్మసినిమా కూడా అప్పటికే రెడీ కావడం యాధృచ్ఛికం అనుకోవాలా? లేక వెల్ ప్లాన్డ్ అనుకోవాలా?