ఆయనే హీరో.. ఆయనే విలన్

కాస్త గ్యాప్ తరువాత మళ్లీ స్క్రీన్ మీదకు వస్తున్నారు మంచు మోహన్ బాబు. ఈసారి ఆయన తన ఫ్యాన్స్ కు డబుల్ ధమాకా ఇవ్వబోతున్నారు. అంటే మరేం లేదు. డబుల్ రోల్ చేయబోతున్నారు. తనే…

కాస్త గ్యాప్ తరువాత మళ్లీ స్క్రీన్ మీదకు వస్తున్నారు మంచు మోహన్ బాబు. ఈసారి ఆయన తన ఫ్యాన్స్ కు డబుల్ ధమాకా ఇవ్వబోతున్నారు. అంటే మరేం లేదు. డబుల్ రోల్ చేయబోతున్నారు. తనే హీరోగా, విలన్ గా కనిపించబోతున్నారు. 

విలన్ గా సినిమా కెరీర్ ప్రారంభించిన మంచు మోహన్ బాబు ఆ తరువాత హీరోగా మారారు. ఇప్పడు ఆ రెండు షెడ్స్ ఒకే సినిమాలో చూపించబోతున్నారు.  పెళ్లయిన కొత్తలో, గరం వంటి సినిమాలు అందించిన మదన్ డైరక్షన్ లో మోహన్ బాబు ఓ సినిమా చేస్తున్నారు. స్వంత బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ చిత్రం కోసం కాస్త భారీ బడ్జెట్ నే ఖర్చుచేస్తున్నారు.

తండ్రీ కూతుళ్ల మధ్య వుండే అనుబంధం బేసిక్ లైన్ గా మదన్ అందించిన కథలో మోహన్ బాబు రెండు మిడిల్ ఏజ్జ్ క్యారెక్టర్లు పోషిస్తున్నారు. ఒకటి పాజిటివ్.. ఒకటి నెగిటివ్ అన్నమాట. సినిమాలో కీలకమైన కూతురు పాత్రను ఓ మళయాలీ నటి పోషిస్తున్నట్లు తెలుస్తోంది.