మోక్షజ్ఞ ఎంట్రీ 2019లోనే?

నందమూరి మోక్షజ్ఞ. హీరో బాలకృష్ణ నట వారసుడు. తెరపైకి వస్తాడని ఏడాది కాలంగా వినిపిస్తోంది. రాజమౌళి, క్రిష్ వంటి దర్శకుల పేర్లు, సాయి కొర్రపాటి వంటి నిర్మాత పేరు వినిపించింది. కానీ ఇప్పటికీ ఫైనల్…

నందమూరి మోక్షజ్ఞ. హీరో బాలకృష్ణ నట వారసుడు. తెరపైకి వస్తాడని ఏడాది కాలంగా వినిపిస్తోంది. రాజమౌళి, క్రిష్ వంటి దర్శకుల పేర్లు, సాయి కొర్రపాటి వంటి నిర్మాత పేరు వినిపించింది. కానీ ఇప్పటికీ ఫైనల్ కాలేదు. ఎప్పుడు అన్నది బాలయ్య కూడా బాహాటంగా చెప్పలేదు.

అయితే ఇటీవల మోక్షజ్ఞ తన తండ్రి క్యారెక్టర్లో తాత ఎన్టీఆర్ బయోపిక్ లో కనిపించబోతున్నారన్న వార్తలు గుప్పమన్నాయి. అయితే ఇది పరిశీలనలో వున్న మాట వాస్తవమే అని, ఇంకా డెసిషన్ మాత్రం తీసుకోలేదని ఎన్టీఆర్ బయోపిక్ యూనిట్ వర్గాల బోగట్టా. 

ఎన్టీఆర్ బయోపిక్ 2018 మార్చిలో స్టార్ట్ అవుతుంది. ఒకవేళ అందులో మోక్షజ్ఞ నటించినా అది నేరుగా హీరో ఎంట్రీ కాదు. అందువల్ల సోలోగా మోక్షజ్ఞ సినిమా చేయడం అన్నది 2018లో వుండకపోవచ్చు. ఎందుకంటే ఆ ఇయర్ ఎండింగ్ లో ఎన్నికలు అన్న టాక్ వినిపిస్తోంది. అప్పుడు బాలయ్య రాజకీయంగా బిజీగా వుంటారు. సో, సోలోగా మోక్షజ్ఞ సినిమా 2019 నాటికే వుండే అవకాశం వుంటుందని తెలుస్తోంది.

పైగా ఇండస్ట్రీలో వినిపిస్తున్న గుసగుసలు వేరుగా వున్నాయి. తన సినిమా కెరీర్ ఎంట్రీపై మోక్షజ్ఞ అంత సీరియస్ గా వున్నారా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అలా వుండి వుంటే ఈ పాటికే ఓ ప్రాజెక్ట్ కొలిక్కి వచ్చి వుండేదని అంటున్నారు.