మీడియా ఒక్కోసారి ఎందుకో అత్యుత్సాహం చూపిస్తుంటుంది. ఈ మధ్యన హీరో నాగార్జున మీసం తీసేసి, క్లీన్ షేవ్ తో కనిపిస్తున్నాడు. ఒకసారి అడిగారు, రెండు సార్లు అడిగారు, మూడుసార్లు అడిగారు. ఇలా కనిపించిన ప్రతిసారీ మీడియాలో ఎవరో ఒకరు అదే క్వశ్చను అడుగుతున్నారు. దీంతో నాగ్ కు చిర్రెత్తుకు వచ్చినట్లుంది.
అయినా కూడా కాస్త నవ్వుతూనే, మీసం పెంచితే అడుగుతారు. తీస్తే అడుగుతారు. ఇదెక్కడి బాధ. అయినా నా మీసం, నా ఇష్టం అని కాస్త గట్టిగానే అనేసాడు. ఇకనైనా మీడియా జనాలు నాగ్ మీసం గురించి వదిలేస్తే మంచిదేమో? అలాగే పదే పదే నాగ్-సమంత, మామ కోడలు అంటూ అడుగుతుంటే, మళ్లీ నాగ్ కౌంటర్ వేసేసాడు.
ఇక నాకు సమంత తప్ప వేరే ఎవరూలేరా? సోషల్ మీడియాలోనూ ఇదే, బయటకు వచ్చినా ఇదేనా.. ఎంత సేపూ.. మామ-కోడలు, మామ-కోడలు అంటారు అంటూ ఎందుకయినా మంచిదని ఓ నవ్వు విసిరేసాడు.
ఇలా అడిగిన క్వశ్చన్లే అడగడం మీడియా మానేయకపోతే, నాగ్ లాంటి వాళ్ల నుంచి ఇలాంటి సమాధానాలే వస్తాయేమో?