ఎంతయినా సమంత సమంతానే. మల్టీ టాస్క్ లు చేయడంలో సూపర్. ఒకపక్క పెళ్లి ముహూర్తం దగ్గరకు వస్తుంటే, ట్విట్టర్ లో అభిమానులతో ముచ్చట్లు. పెళ్లయిన వెంటనే మళ్లీ అభిమానులకు, సంతోష సందేశాలకు సమాధానాలు. ఆ వెంటనే రాజుగారి గది-2 ప్రమోషన్ కు హాజరు. ఇలా మల్టీ టాస్క్ చేసే సమంత, శనివారం మరోసారి అదే పని చేసింది.
ప్రింట్ మీడియాకు ఫోన్లో ఇంటర్వూలు ఇచ్చింది. ఎవరికి ఎంతసేపు కావాలంటే అంతసేపు ఫోన్ ల్లో మాట్లాడింది. చిత్రమేమిటంటే, ఇదేరోజు అంటే శనివారం నాడు కొత్త దంపతులు నాగ్ ఇంట్లో ఓ పూజలో పాల్గొనాల్సి వుందని తెలుస్తోంది. ఆ పనులు అలా జరుగుతూ వుండగానే ప్రింట్ మీడియాకు ఇంటర్వూలు ఇచ్చింది సమంత.
రాజుగారి గది-2 కలెక్షన్లు బాగుండడంతో, సినిమాను స్టడీగా వుంచాలని, ప్రమోషన్ దగ్గర జాగ్రత్తగా వుండాలని, సమంత ఇలా ఫోన్ ల్లో వరుసపెట్టి ఇంటర్వూలు ఇచ్చేసింది. ముఖ్యంగా తన నటనకు మంచి ప్రశంసలు వస్తుండడంతో, సమంత ఫుల్ హ్యాపీగా ప్రమోషన్ లు సాగిస్తోంది.