అప్పుడెప్పుడో నాగార్జున నిర్వహించిన ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ కార్యక్రమానికి హాజరైంది సమంత. ఆ సందర్భంలో నాగార్జున అడిగిన చిన్ని చిన్ని ప్రశ్నలకు కూడా సమంత సమాధానం ఇవ్వలేకపోయింది. తమిళనాడుతో సరిహద్దును పంచుకోని దక్షిణాది రాష్ట్రం ఏది? అని ఈ తమిళ అమ్మాయిని అడిగితే దానికి సమాధానం ఇవ్వలేకపోయింది. ఆ ప్రశ్నకు త్రివిక్రమ్ శ్రీనివాస్ కు హెల్ప్ లైన్ కాల్ చేసింది.
ప్రశ్నకు సమాధానం ఇస్తూనే… సమంతకు క్లాస్ పీకాడు త్రివిక్రమ్. ‘మీ రాష్ట్రానికి ఒకవైపు ఆంధ్రప్రదేశ్ ఉంటుంది, ఇంకోవైపు కేరళ, ఇంకో వైపు కర్ణాటకలు ఉంటాయి.. తమిళనాడుతో సరిహద్దులేని రాష్ట్రం తెలంగాణ అని తెలీదా… చెన్నైలో పుట్టి పెరిగావు..’ అంటూ సరదాగా క్లాస్ పీకాడు త్రివిక్రమ్. హీరోయిన్లకే కాదు.. చాలా మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు కూడా తమ రాష్ట్ర, దేశ సరిహద్దులు తెలియకపోవడం పెద్ద విశేషం కాదు మన దగ్గర.
ఆ సంగతలా ఉంటే.. హిందూ దేవుళ్లకు సంబంధించి ఏదో చిన్న ప్రశ్న అడిగాడు నాగ్. దానికి కూడా సమంత సమాధానం ఇవ్వలేకపోయింది. ఇదేమీ.. పురాణాల్లో, వేదాల్లో, ఉపనిషత్తుల్లో అధ్యయనం చేయాల్సిన ప్రశ్న కాదు. చిన్నదే.. దానికి కూడా సమంత సమాధానం ఇవ్వలేకపోయింది. అదేంటి.. అని అడిగితే, తమ ఇంట్లో హిందూయిజం పూర్తిగా బంద్ అని సమంత చెప్పింది.
తన తల్లి పక్కా క్రిస్టియన్ అని.. పక్కా కన్జర్వేటివ్ అని, టీవీలో హిందూ దేవుళ్ల గురించి వచ్చే సీరియల్స్ ను కూడా చూడనిచ్చేది కాదని సమంత ఓపెన్ గానే చెప్పింది. అంత తీవ్రమైన క్రిస్టియన్ అట సమంత తల్లి. అలాంటి పెంపకం నుంచి వచ్చిన సమంత ఇప్పుడు.. ఒక్కతే తిరుమలకు వెళ్లేంత వరకూ వచ్చేసింది. పిల్లలను ఏ విషయంలో అయినా తీవ్రమైన ఒత్తిడి చేసి పెంచింతే.. కథ అందుకు రివర్స్ అవుతుందనేందుకు కూడా సమంత ఒక ఉదాహరణ ఏమో.
హిందూ దేవుళ్లను టీవీల్లో కూడా చూడనివ్వకూడదని సమంత తల్లి అనుకుంది.. ఇప్పుడు సమంత ఒక హిందూ అబ్బాయిని పెళ్లి చేసుకుంది, హిందూ దేవాలయాలకు దేవున్ని వెదుక్కొంటూ వెళ్తోంది! ఇలాంటి నేపథ్యంలో సమంత తల్లి ఫీలింగ్స్ ఎలా ఉండుంటాయో.. పెళ్లితో సమంత తల్లిదండ్రుల హడావుడి ఎక్కడా కనిపించలేదు. మీడియా ద్వారా వెలుగులోకి వచ్చిన ఫొటోల్లో ఎక్కడైనా చూద్దామన్నా.. సమంత తల్లిదండ్రులు అగుపించలేదు.
కనీసం క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం జరిగిన పెళ్లిలో కూడా.. ఇదిగో సమంత తల్లిదండ్రులు అని చెప్పడానికి ఒక్క ఫొటో కనిపించలేదు. సమంత తన అధికారిక ట్విటర్ అకౌంట్లో పెళ్లిలో తల్లిదండ్రులతో దిగిన ఫొటో ఒక్కటి కూడా పోస్టు చేయకపోవడం గమనార్హం.