సాధారణంగా చాలా కూల్ గా వుంటాడు మహేష్ బాబు. సినిమా పరాజయం అయితే ఒప్పుకుంటాడు. సైలెంట్ గా వుండిపోతాడు. దాన్ని ఎత్తాలని కానీ, ఫేక్ కలెక్షన్లు చూపించాలని కానీ అనుకోడు. అలాంటివి ఎంకరేజ్ చేయడు. అయితే అలాంటి మహేష్ బాబుకు ఒక విషయంలో మాత్రం బాగా కోపం వచ్చేసినట్లు తెలుస్తోంది.
స్పైడర్ సినిమా ఎలా వుంది? ఫలితం ఏమిటి? అన్న సంగతి పక్కన పెడితే, సినిమా విడుదల రోజు ఎర్లీ హవర్స్ నుంచి ఓ ప్లాన్డ్ గా, పద్దతి ప్రకారం స్పైడర్ సినిమాను సోషల్ నెట్ వర్క్ లో బద్ నామ్ చేసారని మహేష్ భావిస్తున్నట్లు వినికిడి.
దీని వెనుక ఎవరు వున్నారు? ఎవరెవరు పని చేసారు? అన్న దానిపై మహేష్ ఆరా తీసినట్లు తెలుస్తోంది. అదే సమయంలో ఓ వెబ్ సైట్ ఎవరిది? దాని వెనుక ఎవరున్నారు అన్నది కూడా ఆరా తీసినట్లు తెలుస్తోంది. ఆ వెబ్ సైట్ సోషల్ నెట్ వర్క్ లో మహేష్ మీద కామెంట్లు చేసినట్లు తెలుస్తోంది. ఈ వెబ్ సైట్ పై చాంబర్ లో డిస్కషన్ కు అవకాశం వుంటుందా అని కూడా మహేష్ ఆరా తీసినట్లు తెలుస్తోంది.
అలాగే తనతో తరువాతి సినిమాలు నిర్మిస్తున్న వారిలో ఓ నిర్మాతలను, ఆ సినిమాల పీఆర్వోలు ఎవరు? వాళ్లే హీరోలకు పని చేస్తున్నారు అన్నది కూడా మహేష్ బాబు ఆరా తీసాడని గ్యాసిప్ లు వినిపిస్తున్నాయి.
ఈ గ్యాసిప్ లు నిజమే అయితే కనుక, మహేష్ బాబు తన సినిమాలకు సోషల్ నెట్ వర్క్ సపోర్ట్ మీద సీరియస్ గా దృష్టి పెట్టినట్లే అనుకోవాలి. భరత్ అనే నేను, ఆ తరువాత సినిమాలకు మహేష్ తీసుకునే జాగ్రత్తలు, సోషల్ నెట్ వర్క్ టీమ్ విషయంలో తీసుకునే కేర్ ను బట్టి తెలుస్తుంది ఈ సీరియస్ నెస్ ఎంతవరకు అన్నది.