నాగ చైతన్య-సమంతల పెళ్లి సందడి ముగిసింది. పెళ్లి పెద్దలు దాదాపు అందరూ హైదరాబాద్ కు తిరిగి వచ్చేసారు. కుర్రకారు మాత్రం ఈ నెల పది వరకు అక్కడే వుండి ఎంజాయ్ చేసి వస్తామంటూ ఉండిపోయారు. ఇక కొత్త దంపతులు సమంత-చైతూ కూడా వారిలో భాగమే కదా.
ఇదిలా వుంటే సమంత-చైతూల పెళ్లి సందర్భంగా జరిగిన సందడిలో డ్యాన్స్ లు పిచ్చపిచ్చగా కనిపించాయట. ఆ మాటకు వస్తే పెళ్లి పెద్ద నాగ్ దగ్గర నుంచి పెళ్లి కొడుకు చైతన్య వరకు డ్యాన్స్ చేయని వారే లేరట. అసలు టోటల్ ప్రోగ్రామ్ కు నాగ్ అండ్ చైతన్య డ్యాన్స్ లే కీలకమట.
ఆ ఇద్దరూ కూడా షర్ట్ లు తీసేసి, టాప్ లెస్ గా చేసిన డ్యాన్స్ లు చూసి హాజరయిన కుటుంబ సభ్యులంతా ఫిదా అయిపోయారట. అయితే ఈ డ్యాన్స్ ల విడియో మాత్రం బయటకు వెళ్లకుండా నాగ్ జాగ్రత్త పడినట్లు తెలుస్తోంది. నాగ చైతన్య తల్లి, దగ్గుబాటి వారి ఇంటి ఆడపడుచు కూడా డ్యాన్స్ చేయడం ఈ కార్యక్రమంలో విశేషమంట.
ఇదిలా వుంటే రెండు రకాల పెళ్లిళ్లు ముగిసాక, ప్రత్యేకంగా ఓ స్టేజ్ షో ప్లాన్ చేసి పెర్ ఫార్మ్ చేసారట. రాజమౌళి కొడుకు తదితర యంగ్ చాప్స్ రకరకాల స్కిట్స్ తయారు చేసి ప్రదర్శించారట. ఈ స్కిట్స్ అన్నీ నాగ చైతన్య కు సంబంధించినవే కావడం విశేషం. నాగ చైతన్య చిన్నప్పటి ఫొటొలు, విడియోలు కలిపి, అతని తల్లి తయారు చేయించిన ఓ ఎవి కూడా ఆకట్టుకునేలా సాగిందట.
చివరగా హర్రర్ సినిమాలు అంటే భయపడే నాగ చైతన్యను కుర్చీలో కట్టేసి మరీ, రాజుగారి గది 2 ట్రయిలర్ చూపించేసారట. మొత్తం మీద కేవలం కుటుంబ సభ్యలు, మాట్రిక్స్ ప్రసాద్, టీఎస్ఆర్ దంపతులు, కిషోర్, పివిపి లాంటి అతి కొద్ది మంది సన్నిహితులతో నాగ్ తన కొడుకు పెళ్లిని బాగానే అలరించేలా చేసుకున్నాడన్నది ఫైనల్ పాయింట్.