పాదయాత్ర అంటే వణుకుతున్న తమ్ముళ్ళు…?

ఒక లక్ష్యం సాధన కోసం ఎవరి మార్గాన వారు ప్రయత్నాలు చేస్తారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను అడ్డుకోవడానికి తెలుగుదేశం పార్టీ తమ నేత పల్లా శ్రీనివాసరావు చేత అమరణ దీక్ష చేయించింది. దాన్ని…

ఒక లక్ష్యం సాధన కోసం ఎవరి మార్గాన వారు ప్రయత్నాలు చేస్తారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను అడ్డుకోవడానికి తెలుగుదేశం పార్టీ తమ నేత పల్లా శ్రీనివాసరావు చేత అమరణ దీక్ష చేయించింది. దాన్ని వైసీపీ సహా ఏ పార్టీ నేతలు కూడా అసలు  తప్పుపట్టలేదు కూడా.

ఇపుడు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విశాఖలో  ఏకంగా పాతిక కిలోమీటర్ల పాదయాత్ర చేపడుతున్నారు. ఈ నెల 20న ఈ యాత్ర విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం దగ్గర మొదలై కూర్మన్నపాలెం వరకూ సాగుతుంది. ఈ యాత్ర కోసం వైసీపీ భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. 

జనంలో కూడా బాగానే స్పందన వస్తోంది. మరి దీని చూసి ఉలిక్కిపడ్డారా లేకా వణుకుతున్నారా ఏమో కానీ  తమ్ముళ్లు మాత్రం పాదయాత్ర వద్దంటే వద్దు అంటున్నారు. 

పాదయాత్ర చేస్తాం, పార్లమెంట్ లోనూ పోరాడుతాం, కేంద్రం పైన అన్ని రకాలుగా వత్తిడి తెస్తాం, మా విధానాలు మాకు ఉన్నాయని పక్కా క్లారిటీగా వైసీపీ నేతలు చెబుతున్నా కూడా తమ్ముళ్ళు మాత్రం గల్లీలో ఆందోళనలు ఏంటి అంటున్నారు.

అదే తప్పు అయితే టీడీపీ నేతలు కూడా గల్లీలోనే కదా ఆందోళలను చేస్తోంది అని వైసీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. మొత్తానికి చూస్తే విశాఖలో విజయసాయిరెడ్డి  పాదయాత్ర  అంటేనే టీడీపీకి భయం పట్టుకుందని, అందుకే అర్ధం పర్ధం లేని విమర్శలు చేస్తున్నారని వైసీపీ నేతలు అంటున్నారు. 

చంద్రబాబుకు బుర్ర‌ చెడినట్టుంది

కుప్పంలో టీడీపీ 14 స్థానాల‌కే ప‌రిమిత‌మైంది