చైతూ.. సమంతలతో.. మారుతి ఇగో సమస్యలు?

శీర్షిక చూసి గాభరా ఏమీ అక్కరలేదు. చైతూ.. సమంతలతో మారుతి చేయబోయే సబ్జెక్ట్ ఇగో సమస్యల చుట్టూ తిరుగుతుందట. 100 పర్సంట్ లవ్ సినిమాలో పెళ్లికి ముందు ఇగో సమస్యలను దర్శకుడు సుకుమార్ డీల్…

శీర్షిక చూసి గాభరా ఏమీ అక్కరలేదు. చైతూ.. సమంతలతో మారుతి చేయబోయే సబ్జెక్ట్ ఇగో సమస్యల చుట్టూ తిరుగుతుందట. 100 పర్సంట్ లవ్ సినిమాలో పెళ్లికి ముందు ఇగో సమస్యలను దర్శకుడు సుకుమార్ డీల్ చేసారు. ఇప్పుడు మారుతి పెళ్లి తరువాత ఇగో సమస్యలను డీల్ చేసే స్క్రిప్ట్ తయారుచేసినట్లు తెలుస్తోంది.

మారుతి డైరక్షన్ లో నాగ్ చైతన్య హీరోగా సితార ఎంటర్ టైన్ మెంట్స్ ఓ సినిమా ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు హీరోయిన్ గా సమంత అన్నది మారుతి ఛాయిస్. దానికి ఇంకా చైతూ, సమంతల దగ్గర నుంచి ఫుల్ గ్రీన్ సిగ్నల్ రావాల్సి వుంది. ఈ సినిమాలో ఓ లాయర్ ది కీలకపాత్ర వుంటుదని తెలుస్తోంది. ఈ పాత్రను ఓ కీలకనటుడు పోషిస్తారని తెలుస్తోంది.

ప్రస్తుతం పెళ్లి హడావుడిలో వున్న చైతూ రెండోవారం నుంచి మైత్రీ మూవీస్-చందు మొండేటి సినిమా మొదలుపెడతారు. మరో రెండు వారాలకు మారుతి సినిమా స్టార్ట్ చేస్తారు. చందు మొండేటి సినిమాకు హీరోయిన్ గా నిథి అగర్వాల్ ను తీసుకునే ఆలోచనలో వున్నారు. మరోపక్క పూజా హెగ్డే ను కూడా ట్రయ్ చేస్తున్నారు. మరి మారుతి సినిమాకు సమంత కాకపోతే, మరి ఎవర్ని ఆలోచిస్తారో చూడాలి.