చైతూ-సమంత పెళ్లి రోజు దగ్గరకు వచ్చేస్తోంది. గోవాలోని వగ్టోర్ బీచ్ ఏరియాలో వున్న డబ్ల్యు హోటల్ ను పెళ్లికి విడిదిగా ఎంచుకున్నట్లు తెలుస్తోంది. మరీ అద్భుతమైన విలాసవంతమైన హోటల్ అని కాదు కానీ, కాస్త పేరున్న పెద్ద హోటల్ నే.
ఇక్కడ రూమ్ టారిఫ్ స్టార్టింగ్ ప్రయిస్ నే రోజుకు పదమూడు వేలు. అదే హోటల్ లో ఖరీదైన సూట్ అయితే రోజుకు 75వేలు. ఈ హోటల్ లో గదులను అతిధులకు, నాగ్, సమంత ఫ్యామిలీకి, కాబోయే దంపతులకు బుక్ చేసారు. అయితే చైతన్య అతని ఫ్రెండ్స్ ఆ పక్కనే వున్న మరో హోటల్లో వుంటారు.
సుమారు రెండు వందల మంది హైదరాబాద్ నుంచి గోవా వెళ్తున్నారు. అతిధులను గతంలో అఖిల్ పెళ్లి అనుకున్నపుడు రెగ్యులర్ ఫ్లయిట్ లో టికెట్ లు బుక్ చేసి తీసుకెళ్దామనుకున్నారు. అలాగే బుక్ చేసారు కూడా.
ఈసారి మాత్రం చాలా మంది అతిధులు ఎవరి కన్వీయన్స్ ను బట్టి వాళ్లు టికెట్ లు తీసుకున్నారు. ఒకరిద్దరు అతిధులు చార్టర్ ఫ్లయిట్ ను తీసుకున్నట్లు తెలుస్తోంది. డబ్ల్యు హొటల్ లోనే అటు క్రిస్టియన్, ఇటు హిందూ సంప్రదాయ రీతుల్లో వివాహం జరుగుతుంది.