చైతూ సరసన డిజాసర్ట్ గర్ల్?

నాగ్ చైతన్య అప్ కమింగ్ ప్రాజెక్టుల్లో చందు మొండేటి సవ్యసాచి ఒకటి. అసలే ఈ సినిమా ఒక అడుగు ముందుకు, ఒక అడుగు వెనక్కు అన్నట్లు నడుస్తోంది. ఇదిగో ముహుర్తం, అదిగో ముహుర్తం అంటూ…

నాగ్ చైతన్య అప్ కమింగ్ ప్రాజెక్టుల్లో చందు మొండేటి సవ్యసాచి ఒకటి. అసలే ఈ సినిమా ఒక అడుగు ముందుకు, ఒక అడుగు వెనక్కు అన్నట్లు నడుస్తోంది. ఇదిగో ముహుర్తం, అదిగో ముహుర్తం అంటూ సాగుతోంది. ఈలోగా కథ పై అక్కర్లేని కాంట్రావర్సీ ఒకటి. అది అయిపోయింది అనుకుంటే, మారుతి కాంబినేషన్ లో సినిమా తెరపైకి వచ్చింది.

ఏది ముందు, ఏది వెనుక అన్న దానిపై రకరకాల గ్యాసిప్ లు వున్నాయి. తన పెళ్లి తరువాత ఏ నిర్ణయమూ తీసుకుంటాడు చైతన్య అని టాక్ వుంది. కాదు చందు మొండేటి సినిమా స్టార్ట్ చేసి, కొంత ఫినిష్ చేసి, మారుతి సినిమా మీదకు వస్తాడనీ టాక్ వుంది.

ఇదిలా వుంటే, నాగ్ చైతన్య సినిమాకు హీరోయిన్ ఫిక్స్ అయిందని, బెంగుళూరు మోడల్ నిధి అగర్వాల్ ను చందు తన చాయిస్ గా అనుకుంటున్నాడని టాక్ వినిపిస్తోంది. ఈ అమ్మాయి ఇప్పటికే ఓ డిజాస్టర్ లో నటించింది.

జాకీ షరాఫ్ కొడుకు టైగర్ షరాఫ్ సినిమా మున్నా మైకేల్ లో ఈమెనే హీరోయిన్. ఆ సినిమా పరమ డిజాస్టర్. పోయి పోయి హిట్ ట్రాక్ వున్న అమ్మాయిని తేకుండా ఇలాంటి అమ్మాయిని తెస్తున్నాడేమిటి? చందు మొండేటి అని టాక్ వినిపిస్తోంది ఇండస్ట్రీలో.