ఎన్టీఆర్ ఇకపై అలా మాట్లాడడు?

సమీక్షకులను దారినపోయే దానయ్యలు గా అభివర్ణించి, తన బాధను వెళ్లగక్కాడు ఎన్టీఆర్. అయితే ఇది రెండు రకాలుగా బయటకు వెళ్లింది. ఇండస్ట్రీ జనాలు ఎన్టీఆర్ కు దన్నుగా నిల్చున్నారు. కానీ మీడియాలో మాత్రం దీనికి…

సమీక్షకులను దారినపోయే దానయ్యలు గా అభివర్ణించి, తన బాధను వెళ్లగక్కాడు ఎన్టీఆర్. అయితే ఇది రెండు రకాలుగా బయటకు వెళ్లింది. ఇండస్ట్రీ జనాలు ఎన్టీఆర్ కు దన్నుగా నిల్చున్నారు. కానీ మీడియాలో మాత్రం దీనికి కౌంటర్ గా వార్తలు వచ్చాయి. ఎన్టీఆర్ అభిమానులు మాత్రం ఆయన అలా చెప్పడం కరెక్టే అన్నారు.

కానీ విశ్వసనీయ వర్గాల బోగట్టా ప్రకారం, ఎన్టీఆర్ సన్నిహితులు మాత్రం, భవిష్యత్ లో ఇలా మాట్లాడవద్దని ఎన్టీఆర్ కు సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. మీడియాతో సంయమనంగానే వుండాలి తప్ప, రచ్చ చేసుకోవడం సరి కాదని, ఎన్టీఆర్ కు సన్నిహితులు వివరించి చెప్పినట్లు వినికిడి.

అయితే ఎన్టీఆర్ ఇలా వేదిక మీద మాట్లాడతాడని, ఆయన సన్నిహితులకు అస్సలు తెలియదట. ముఖ్యంగా కళ్యాణ్ రామ్ కు కూడా. అలా తెలిసి వుంటే వద్దని చెప్పేవాడినని కళ్యాణ్ రామ్ అన్నట్లు తెలిసింది.

అయిపోయింది ఏదో అయిపోయింది, ఇకపై ఇలా బహిరంగంగా మీడియాపై కామెంట్ లు తగదు అని సన్నిహితులు చెప్పిన దాంతో ఎన్టీఆర్ ఏకీభవించినట్లు తెలుస్తోంది. బిగ్ బాస్ టైమ్ లో, జై లవకుశ విడుదలకు ముందు మీడియానే ఎంత కవరేజ్ ఇచ్చిందో, ఏ మేరకు ఎన్టీఆర్ ఇమేజ్ పెంచిందో, సన్నిహితులు వివరించారట. 

అంటే ఇక భవిష్యత్ లో ఎన్టీఆర్ మరోసారి సమీక్షకుల మీద విరుచుకుపడరనే అనుకోవాలి. అయినా రాబోయేవి అన్నీ బయట నిర్మాతల సినిమాలు కదా? ఎన్టీఆర్ స్వంత సినిమాలు కాదు. మొన్నటికి మొన్న వాట్సప్ లో అదే విషయం చలామణీ అయింది. తన సినిమా నిర్మాత టాంక్ బండ్ లో దూకినపుడు, తన సినిమాలు డిజాస్టర్లు అయినపుడు మీడియాను పల్లెత్తు మాట అనని ఎన్టీఆర్, స్వంత సినిమా అనేసరికి ఓపెన్ అయ్యారని సోషల్ నెట్ వర్క్ లో కామెంట్లు వచ్చాయి కదా.