రెండు పెద్ద సినిమాలు రంగంలో వుంటాయని తెలిసీ, రెండు మూడు వారాల ముందు అప్పటికప్పుడు ప్లాన్ చేసుకుని రంగంలోకి దింపారు మహానుభావుడు సినిమాను. ఎంత యువి కి కొన్ని స్వంత లీజు థియేటర్లు వున్నా, ఎంత దిల్ రాజు, అరవింద్ లాంటి వాళ్ల మద్దతు వున్నా పెద్దగా థియేటర్లు దొరకలేదు. మూడు వందల యాభై కి పైగా థియేటర్లలో మహానుభావుడు విడుదలయింది. అయితే ఒకటే థీమా, 11 కోట్ల సినిమా, ఆరు కోట్లు శాటిలైట్ రికవరీ అయిపోయింది. మిగిలింది అయిదు కోట్లే. ఓవర్ సీస్ లో దగ్గర దగ్గర నాలుగు కోట్లు, ఈస్ట్ వెస్ట్, బెంగుళూరు అమ్మకాలతో కలిపి లాభం వచ్చేసింది. ఇక సీడెడ్, నైజాం, వైజాగ్, కృష్ణ, గుంటూరు, నెల్లూరు వీళ్ల దగ్గరే వున్నాయి.
సినిమా విడుదలయింది. మంచి టాక్ యునానిమస్ గా తెచ్చుకుంది. తొలి రోజు వసూళ్లు థియేటర్ల లెక్క ప్రకారమే వచ్చాయి. తొలి రోజు వసూళ్లు ఈ విధంగా వున్నాయి
నైజాం 75 లక్షలు
ఉత్తరాంధ్ర 39 లక్షలు
సీడెడ్ 34 లక్షలు
ఈస్ట్ 30 లక్షలు
వెస్ట్ 19 లక్షలు
నెల్లూరు 8 లక్షలు
గుంటూరు 25 క్షలు
కృష్ణా 22 లక్షలు
అంటే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రెండు కోట్ల యాభై రెండు లక్షల షేర్ అన్నమాట. ఇవి కాక, కర్ణాటక వుంది. ఓవర్ సీస్ వుంది.
ఇదిలా వుంటే మహానుభావుడుకి వున్న ప్లస్ ఏమిటంటే, సినిమా జమ్మున కుమ్మేయదు. స్లోగా, కంటిన్యూగా వుంటుంది. శని ఆది, సోమ (గాంధీ జయంతి) తో కలిసి నాలుగు రోజుల లాంగ్ వీకెండ్ తో మంచి లాభాలు చేసుకుంటుంది.