మారుతి అంటే మెగా కాంపౌండ్ మనిషి. ఆ కాంపౌండ్ లో కొందరు హీరోలకు చాలా క్లోజ్. అలాంటి దర్శకుడు బడా హీరోతో సినిమా చేస్తున్నాడంటే ఎవరైనా సహజంగా మెగాహీరోల వైపే చూస్తారు. మరీ ముఖ్యంగా మారుతికి క్లోజ్ అయిన బన్నీ వైపు చూస్తారు. కానీ మారుతి మాత్రం అక్కినేని అన్నదమ్ములపై కన్నేశాడు.
అవును.. అఖిల్, నాగచైతన్యలతో సినిమాలు ప్లాన్ చేస్తున్నానని ప్రకటించాడు మారుతి. వీరిలో నాగచైతన్యతో సినిమా ఇప్పటికే ఓకే అయింది. చైతూ కోసం ఓ మంచి కథ రాస్తున్నానని తెలిపిన మారుతి, సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై ఆ సినిమా ఉంటుందని ప్రకటించాడు.
మరోవైపు అఖిల్ తో కూడా సినిమా చేసేందుకు ప్రయత్నించాడు మారుతి. నిజానికి నాగచైతన్య కంటే ముందే అఖిల్ తో మూవీ వర్కవుట్ చేయాలనుకున్నాడు. మహానుభావుడు సినిమా స్టోరీని ముందు అఖిల్, నాగార్జునకే వినిపించాడట.
కానీ అప్పటికే ఓ సినిమాకు అఖిల్ కమిట్ అవ్వడంతో.. డైరక్టర్ గా గ్యాప్ రాకూడదనే ఉద్దేశంతో శర్వానంద్ తో సినిమా పూర్తిచేసినట్టు తెలిపాడు. నాగచైతన్యతో సినిమా కంప్లీట్ అయిన వెంటనే అఖిల్ ను మళ్లీ సంప్రదిస్తానంటున్నాడు మారుతి.