పవన్ అభిమానులకు నిరాశే

త్రివిక్రమ్-పవన్ సినిమా ఫస్ట్ లుక్ ఆ మధ్య విడుదలయింది. సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అయితే టీజర్ ఎప్పుడు వస్తుందా అని పవన్ అభిమానులు ఎదురు చూస్తున్నారు. దసరా సందర్భంగా వచ్చే అవకాశం వుందిన వార్తలు…

త్రివిక్రమ్-పవన్ సినిమా ఫస్ట్ లుక్ ఆ మధ్య విడుదలయింది. సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అయితే టీజర్ ఎప్పుడు వస్తుందా అని పవన్ అభిమానులు ఎదురు చూస్తున్నారు. దసరా సందర్భంగా వచ్చే అవకాశం వుందిన వార్తలు ముందుగా వినవచ్చాయి.

కానీ లేటెస్ట్ న్యూస్ ఏమిటంటే, అలాంటి ఆలోచన ఏదీ లేదని. సినిమా విడుదలకు ఇంకా మూడు నెలలకు పైగా టైమ్ వుంది. అందువల్ల ఇప్పటి నుంచే టీజర్ విడుదల అన్నది సరి కాదని, హారిక హాసిన యూనిట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

పైగా ఇప్పుడు పవన్-త్రివిక్రమ్ ఇద్దరూ సినిమా షూట్ లో బిజీగా వున్నారు. టీజర్ రూపకల్పన పై దృష్టిపెట్టేంత తీరుబాటు లేదు. అందుకే అస్సలు ఆ ఆలోచన ఏదీ చేయడం లేదని తెలుస్తోంది. అంతగా అవకాశం వుంటే దీపావళికి విడుదల చేసే ఆలోచన చేస్తున్నట్లు వినికిడి.