అదిగో ఉదయభాను.. ఇదిగో అయిటమ్ సాంగ్

ఉన్నట్లుండి ఓ గ్యాసిప్. త్రివిక్రమ్ సినిమాలో ఏంకర్ ఉదయభాను అయిటమ్ సాంగ్ చేయబోతోందని. వాస్తవానికి జనాలు నమ్మలేదు. ఎందుకంటే ఉదయభాను ఆఫ్ ది స్క్రీన్ అయిపోయి చాలా కాలం అయింది. Advertisement ఆమె, ఆమె…

ఉన్నట్లుండి ఓ గ్యాసిప్. త్రివిక్రమ్ సినిమాలో ఏంకర్ ఉదయభాను అయిటమ్ సాంగ్ చేయబోతోందని. వాస్తవానికి జనాలు నమ్మలేదు. ఎందుకంటే ఉదయభాను ఆఫ్ ది స్క్రీన్ అయిపోయి చాలా కాలం అయింది.

ఆమె, ఆమె పిల్లలు, ఆలనా పాలనా అన్నింటితో బిజీ కావడం కారణం కావచ్చు. అయితే మళ్లీ ఓ డ్యాన్స్ షో తో టీవీ లోకి వస్తున్నట్లు బోగట్టా. మరి దీన్ని బట్టి పుట్టించారో, మరెలా పుట్టించారో కానీ, ఏకంగా త్రివిక్రమ్-పవన్ సినిమాలోకే తీసుకెళ్లిపోయారు.

అయితే విశ్వసనీయ వర్గాల బోగట్టా ఏమిటంటే, త్రివిక్రమ్-పవన్ కాంబో సినిమాలో అయిటమ్ సాంగే లేదు. బేసిక్ గా త్రివిక్రమ్ కు ఐయిటమ్ సాంగ్ లు అంటే అంత ఇష్టంలేదు. అదీ కాక ఆ సినిమా 150కోట్ల సినిమా. అలాంటి సినిమాలో అయిటమ్ సాంగ్ వుంటే, అందుకు తీసుకునే స్టార్ రేంజ్ ఓ రేంజ్ లో వుంటుంది. 

సో ఉదయభాను అయిటమ్ సాంగ్ అది కూడా త్రివిక్రమ్ సినిమాలో చేస్తోంది అనడం వట్టి మాట అని ఫిక్సయిపోవచ్చు. ఇది పక్కా.