పంపిణీ చేయాల్సిన సినిమాలతో వీర బిజీ అయిపోయారు దిల్ రాజు గత రెండు నెలలుగా. అందుకే సాయి ధరమ్ తేజ జవాన్ సినిమాను పక్కన పెట్టారు. ఆ సినిమాకు కాస్త రిపేర్లు చేయాల్సి వుంది.
అలా చేయాలంటే దిల్ రాజు చూసి, దానిపై కాస్త టైమ్ స్పెండ్ చేయాల్సి వుంది. అది కుదరకే అలా వుంచారు. ఈ లోగా రవితేజతో నిర్మించిన రాజా ది గ్రేట్ సినిమాను అక్టోబర్ విడుదలకు రెడీ చేసారు. అక్టోబర్ 18న ఆ సినిమా విడుదల చేయబోతున్నారు.
ఇక కాస్త తీరుబాటు చిక్కింది కాబట్టి, జవాన్ సినిమాను కూడా జనం ముందుకు తెచ్చేయాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. నవంబర్ 3న ఆ సినిమాను విడుదల చేయాలని చూస్తున్నారు.
నవంబర్ లో సరైన సినిమాలు ఏవీ లేవు. మూడున బన్నీ వాసు నిర్మించిన నెక్ట్స్ నువ్వే సినిమా విడుదల వుంది. ఆ సినిమా తో పాటే జవాన్ ను విడుదల చేయాలని దిల్ రాజు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు థియెటర్లు ఫిక్స్ చేస్తున్నారు. మరి సినిమా క్వాలిటీ ఫిక్సింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారో?