నాగశౌర్య సినిమా కు కోటీపాతిక బోణీ

నాగశౌర్య సినిమా వచ్చి కాస్త ఎక్కువ కాలమే అయింది. జ్యో అచ్యుతానంద తరువాత ఫుల్ లెంగ్త్ సినిమా రాలేదు. మధ్యలో లైకా ప్రొడక్షన్స్ సారథ్యంలో కణం సినిమా చేయడమే ఇందుకు కారణం. Advertisement మరోపక్క…

నాగశౌర్య సినిమా వచ్చి కాస్త ఎక్కువ కాలమే అయింది. జ్యో అచ్యుతానంద తరువాత ఫుల్ లెంగ్త్ సినిమా రాలేదు. మధ్యలో లైకా ప్రొడక్షన్స్ సారథ్యంలో కణం సినిమా చేయడమే ఇందుకు కారణం.

మరోపక్క స్వంత బ్యానర్ లో సినిమా స్టార్ట్ చేసి, దాదాపు ఫినిష్ చేసాడు. దీంతో ఇప్పుడు రెండు సినిమాలు నవంబర్, డిసెంబర్ ల్లో విడుదలకు రెడీ అయ్యాయి. అంటే నెల గ్యాప్ లో వరుసగా రెండు సినిమాలు అన్నమాట.

ఇధిలా వుంటే స్వంత బ్యానర్ లో చేస్తున్న సినిమాకు మార్కెట్ బోణీ పడింది. సినిమా హిందీ ఆల్ రైట్స్ కోటి ఇరవై లక్షలకు అమ్ముడుపోయాయి. సినిమాకు ఇంకా టైటిల్ కూడా ఫిక్స్ కాలేదు. త్రివిక్రమ్ దగ్గర పని చేసిన అసోసియేట్ ఈ సినిమాకు దర్శకుడు. సబ్జెక్ట్ విని హిందీ టీవీ, డిజిటల్ ఆల్ రైట్స్ ను తీసుకున్నట్లు తెలుస్తోంది. 

ఇదిలా వుంటే నాగశౌర్య మరో సినిమా సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ లో సైన్ చేసినట్లు తెలుస్తోంది.