అక్కినేని ఇంట పెళ్లి బాజా మోగే రోజు దగ్గరపడింది. వచ్చేనెల 6న సమంత, నాగచైతన్య ఓ ఇంటివారు కాబోతున్నారు. గోవాలో వీళ్ల పెళ్లి సింపుల్ గా జరగనుంది. సమంత, నాగచైతన్య కుటుంబాలకు చెందిన దగ్గరి బంధువులతో పాటు వీళ్లిద్దరికి చెందిన అత్యంత సన్నిహితులు మాత్రమే ఈ పెళ్లికి హాజరవుతున్నారు. అలా మొత్తంగా 150మంది మాత్రం గోవాలో పెళ్లికి హాజరవుతున్నారు.
నిజానికి ఇంతకంటే తక్కువ మందిని గోవాలో పెళ్లికి ఆహ్వానించాలనుకున్నారు. కానీ లెక్కలేస్తే అంతా కలిసి 150మంది అయ్యారట. ఇక అంతకంటే తగ్గించడం సాధ్యంకాలేదట అక్కినేని కుటుంబానికి. వచ్చేనెల 6న హిందూ సంప్రదాయంలో, 7న క్రిస్టియన్ పద్ధతిలో సమంత-చైతూ పెళ్లి చేసుకోబోతున్నారు. పెళ్లి తర్వాత హైదరాబాద్ లో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటుచేశారు.
కాబోయే భార్యభర్తలిద్దరూ ప్రస్తుతం పెళ్లి షాపింగ్ లో బిజీగా ఉన్నారు. సమంత అయితే తను పెళ్లిలో వేసుకోబోయే దుస్తుల ఫొటోల్ని సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేసింది. అటు నాగచైతన్య.. సవ్యసాచి సినిమాను వాయిదావేశాడు. ఈనెల 20న ప్రారంభం కావాల్సిన ఈ సినిమా.. పెళ్లి తర్వాత స్టార్ట్ అవుతుంద