పవన్‌కళ్యాణ్ అవకాశమిస్తే 'సర్దార్ గబ్బర్‌సింగ్'లాంటి చిత్రం తీసిన దర్శకుడు బాబీకి మళ్లీ అవకాశాలు వస్తాయని అనుకోలేదెవరు. అయితే ఎన్టీఆర్‌కి కథ చెప్పి డేట్స్ సాధించి తన సత్తా చాటుకున్నాడు. తన ట్రాక్ రికార్డ్‌ని పట్టించుకోకుండా బాబీకి అవకాశమిచ్చిన ఎన్టీఆర్‌తో అతను 'జై లవకుశ' తీసాడు. సర్దార్ జ్ఞాపకాలని దృష్టిలో వుంచుకుని 'జై లవకుశ' చిత్రానికి జాగ్రత్త పడతాడని అనుకుంటే అతను ఈ అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోలేదు.
'జై లవకుశ'కి బలమైన కథ వుందని అంతా ఒప్పుకుంటున్నారు. అలాగే ఎన్టీఆర్ అభినయాన్ని కూడా మెచ్చుకుంటున్నారు. కానీ ఈ కథని రసవత్తరంగా చెప్పడంలో బాబీ విఫలమయ్యాడు. ఎన్టీఆర్ సినిమాని మాస్‌కి కావాల్సినట్టుగా తీర్చిదిద్దడంలో విఫలమయే సరికి ఈ చిత్రానికి డైరెక్టర్ బ్యాడ్ అనే టాక్ సర్వత్రా వినిపిస్తోంది. సర్దార్ చిత్రానికి పవన్‌ని బాధ్యుడిని చేసేసారు కానీ బాబీ విజన్ చూస్తే ఆ చిత్రం అలా తయారవడంలో ఇతని పాత్ర లేదని అనలేం.
జై లవకుశ కమర్షియల్‌గా ఎలాంటి ఫలితం సాధించినా కానీ దర్శకుడిగా బాబీకి మాత్రం ఇది పెద్ద దెబ్బే. ఇద్దరు అగ్ర హీరోలు అవకాశాలు ఇచ్చినా కానీ వాటిని వాడుకోలేక వృధా చేసుకున్నాడు కనుక అతనికి మళ్లీ అవకాశాలు రావడం అనుమానమే.