ఈ మధ్య సినిమా ట్రయిలర్లు కట్ చేసేటపుడు రకరకాల విన్యాసాలు చేస్తున్నారు. జోనర్ ను చెప్పడం, కానీ అసలు విషయం దాచడం లాంటిది అందులో ఒకటి. మహానుభావుడు సినిమాలో ఫన్ మాత్రమే కాదు, బలమైన ఎమోషన్ సీన్లు కూడా వున్నాయట.
కానీ వాటిని ట్రయిలర్ లోకి తీసుకురాలేదు. స్పైడర్ లో హీరో హీరోయిన్ల మధ్య టీజింగ్ ట్రాక్ వుంది. దాన్నీ బయటకు తీసుకురాలేదు. జై లవకుశలో రాజస్థాన్ లో కొంత కథ జరుగుతుంది. ముగ్గురు హీరోల మధ్యన కీలక ఒప్పందంతో కథ నడుస్తుంది. అదేదీ ట్రయిలర్ లో జస్ట్ ఊహకు కూడా టచ్ చేయలేదు.
ఇక లేటెస్ట్ గా విడుదలైన రాజుగారి గది సినిమా విషయం కూడా అలాంటిదేనంట. జస్ట్ హర్రర్ కామెడీ జోనర్ అని మాత్రమే చూపించారట. కానీ అసలు కథంతా వేరే వుంటుందని తెలుస్తోంది.
కావాలనే కథను ట్రయిలర్ లో అస్సలు రివీల్ చేయలేదని తెలుస్తోంది. డిఫరెంట్ ట్విస్ట్ లతో కథ అల్లుకున్నారని, ట్రయిలర్ లో ఆ సీన్లు తీసుకువస్తే, కథ విషయంలో ఆలోచనలు మొదలై, ట్విస్ట్ లు ఇచ్చే థ్రిల్ పోతుందని, కేవలం అవుటర్ లేయర్ తో మాత్రమే ట్రయిలర్ తయారు చేసారట.