గౌతమ్ మీనన్ అయినా ఆదుకుంటాడా?

తెలుగు, తమిళ భాషల్లో ఎడాపెడా సినిమాలు చేస్తున్నాడు. కానీ ఏ ఒక్క సినిమా కలిసి రావడం లేదు సందీప్ కిషన్ కి. తాజాగా చేసిన నక్షత్రం సినిమా అయితే కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్…

తెలుగు, తమిళ భాషల్లో ఎడాపెడా సినిమాలు చేస్తున్నాడు. కానీ ఏ ఒక్క సినిమా కలిసి రావడం లేదు సందీప్ కిషన్ కి. తాజాగా చేసిన నక్షత్రం సినిమా అయితే కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. ఆ దెబ్బల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సందీప్ కిషన్, తాజాగా మరో తమిళ సినిమా స్టార్ట్ చేశాడు.

గౌతమ్ మీనన్ నిర్మాతగా సందీప్ కిషన్ హీరోగా 'నరగసూరన్' అనే సినిమా నిన్నట్నుంచి సెట్స్ పైకి వచ్చింది. ఇదొక మిస్టరీ థ్రిల్లర్ మూవీ. ఈ ప్రాజెక్టుకు సంబంధించి చెప్పుకోదగ్గ విశేషం ఏంటంటే.. “16-ఎవ్రీ డీటెయిల్స్ కౌంట్” లాంటి సినిమాతో విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్న కార్తీక్ అనే దర్శకుడే ఈ సినిమాను డైరక్ట్ చేస్తున్నాడు.

నిజానికి నాగచైతన్యతో ఈ సినిమా ప్లాన్ చేశాడు గౌతమ్ మీనన్. కానీ అనుకోని కారణాల వల్ల చైతూ తప్పుకోవడంతో, సందీప్ కిషన్ హీరోగా ఇది మొదలైంది. ఈ మూవీతో కచ్చితంగా హిట్ కొడతాననే నమ్మకంతో ఉన్నాడు సందీప్ కిషన్. మరీ ముఖ్యంగా గౌతమ్ మీనన్ సినిమా కాబట్టి తెలుగు-తమిళ భాషల్లో రీచ్ బాగుంటుందని ఎక్స్ పెక్ట్ చేస్తున్నాడు. మరి ఈ యంగ్ హీరోను గౌతమ్ మీనన్ అయినా ఆదుకుంటాడేమో చూడాలి.