పవన్ బ్యాంకాక్ వెళ్లింది అందుకే?

ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు పవన్. కథ ప్రకారం ఈ సినిమాకు అమెరికాతో కనెక్షన్ ఉంది. కానీ యూనిట్ మాత్రం బ్యాంకాక్ వెళ్లింది. దీని వెనక ఓ రీజన్ ఉంది. కేవలం…

ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు పవన్. కథ ప్రకారం ఈ సినిమాకు అమెరికాతో కనెక్షన్ ఉంది. కానీ యూనిట్ మాత్రం బ్యాంకాక్ వెళ్లింది. దీని వెనక ఓ రీజన్ ఉంది. కేవలం ఓ ఫైట్ సీక్వెన్స్ చిత్రీకరించేందుకే యూనిట్ అంతా బ్యాంకాక్ వెళ్లినట్టు తెలుస్తోంది.

పవన్-త్రివిక్రమ్ సినిమాలో టోటల్ గా 7యాక్షన్ బ్లాక్స్ ఉన్నాయి. ప్రతి ఫైట్ ను డిఫరెంట్ గా ప్రజెంట్ చేయబోతున్నారు. ఇందులో భాగంగా వచ్చే ఓ హై ఓల్టేజ్ యాక్షన్ సీన్ కోసం బ్యాంకాక్ వెళ్లారు. ప్రస్తుతం ఆ షూటింగ్ నడుస్తోంది.

కెరీర్ స్టార్టింగ్ నుంచి తన సినిమాల్లో ఫైట్స్ పై స్పెషల్ ఫోకస్ పెట్టేవాడు పవన్. చాలా సినిమాల్లో యాక్షన్ ఎపిసోడ్స్ ను తనే డైరక్ట్ చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. మిగతా సినిమాలతో పోలిస్తే ఈ హీరో సినిమాల్లో ఫైట్స్ భిన్నంగా కనిపిస్తాయి. ప్రస్తుతం చేస్తున్న మూవీలో ఆ డిఫరెన్స్ ఇంకా క్లియర్ గా తెలుస్తుందట.

పవన్ 25వ సినిమాకు ఇంకా పేరుపెట్టలేదు. కీర్తి సురేష్, అను ఎమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 10న విడుదల చేయబోతున్నారు.