ఒకప్పుడు కుర్రకారును తన అందచందాలతో ఉర్రూతలూగించిన నటి మమతా కులకర్ణి. దాదాపు పాతికేళ్ల తర్వాత భారతదేశానికి వచ్చిన ఈ నటి, అందరికీ చిన్నపాటి షాకిచ్చింది. అవును.. మమతా కులకర్ణి ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. ఆమె సాధువు అవతారం ఎత్తింది.
మహా కుంభమేళా సాక్షిగా మమతా కులకర్ణి సాధువుగా మారిపోయింది. కాషాయం ధరించిన ఆమె కుంభమేళాలో ఆమె పిండప్రదానం చేసింది. శివుడు, మహాకాళి ఆజ్ఞతో తను ఇలా మారిపోయానని చెప్పుకొచ్చింది. తన ప్రమేయం లేకుండా అంతా అలా జరిగిపోయిందని అంటోంది.
ట్రాన్స్ జెండర్ (లింగమార్పిడి) సాధువులకు పెట్టింది పేరు కిన్నార్ అఖాడా. పురాతన జునా అఖాడ సంస్థకు అనుబంధ సంస్థ ఇది. ఈ కిన్నార్ అఖాడాలో మమతా కులకర్ణి చేరిపోయింది. ఆమెకు అఖాడాలో పేరు కూడా మార్చారు. ఇకపై మమతా కులకర్ణి పేరు శ్రీయమై మమతానందగిరి.
కిన్నార్ అఖాడ ఆచార్యలు డాక్టర్ లక్ష్మీనారాయణ్ ఆధ్వర్యంలో మమతా కులకర్ణి ఇలా సాధువుగా మారిపోయింది. ఈ సందర్భంగా ఆమెకు మహామండలేశ్వర్ అనే బిరుదు కూడా ఇచ్చారు. ఇకపై దేశమంతా తిరిగి సనాతన ధర్మాన్ని ఆమె ప్రచారం చేస్తుంది.
90ల్లో ఇండియాను ఓ ఊపు ఊపింది మమతా కులకర్ణి. షారూక్, సల్మాన్, అమీర్ లాంటి హీరోల సరసన నటించింది. తెలుగులో కూడా ఆమె సినిమాలు చేసింది. గతేడాది ఆమెపై డ్రగ్స్ ఆరోపణలు వచ్చాయి. 2వేల కోట్ల రూపాయల డ్రగ్ డీల్ కు సంబంధించి మమతా కులకర్ణిపై నమోదైన కేసును, సరైన సాక్ష్యాధారులు లేని కారణంగా, బాంబే హైకోర్టు కొట్టేసింది.
ప్లే బాయ్ వర్క్ :- తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు
తొమ్మిది, సున్నా,ఒకటి, తొమ్మిది, నాలుగు, ఏడు, ఒకటి, ఒకటి, తొమ్మిది, తొమ్మిది వీసీ
దొంగలకీ , దుర్మార్గులకీ సనాతన ధర్మం అనే ముసుగు బాగా ఉపయోగపడుతుంది