బాబు, పవన్ మీద పాల్ పంచులు

ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కేంద్రం చెప్పినట్లుగా నడచుకుంటున్నారని ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఫైర్ అయ్యారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కేంద్రం చెప్పినట్లుగా నడచుకుంటున్నారని ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఫైర్ అయ్యారు. లక్షల కోట్ల విలువ చేసే విశాఖ స్టీల్ ప్లాంట్‌ను వేల కోట్లకు అమ్మకానికి కేంద్ర పెద్దలు సిద్ధం చేస్తున్నారని అన్నారు. ఆర్థిక ప్యాకేజీ అంటున్నారని, కానీ ప్లాంట్‌ను అమ్మకానికి సిద్ధం చేసారని ఆయన విమర్శించారు.

కేంద్రం ఈ విధంగా చేస్తూ ఉంటే, నిలదీయాల్సిన ఏపీ కూటమి పెద్దలు ఏమీ చేయలేకపోతున్నారని పాల్ బాబు, పవన్‌ల మీద విరుచుకుపడ్డారు. స్టీల్ ప్లాంట్ విషయంలో కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఆయన ఆరోపించారు. తాను ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోర్టులో కేసు వేస్తే, రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు కౌంటర్ వేయలేదని ఆయన ప్రశ్నించారు.

కూటమి ప్రభుత్వం పెద్దలు నెలకు పదిహేను వేల కోట్ల వంతున అప్పులు తెస్తున్నారని, ఏపీ అప్పుల పాలు అవుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా పట్టించుకోవడం లేదని అన్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు దావోస్ వెళ్లి ఉత్త చేతులతో తిరిగి వచ్చారని ఆయన ఎద్దేవా చేశారు. పెట్టుబడులు సాధించలేకపోయారని అన్నారు. బాబుని మళ్లీ జైలులో పెట్టి, పవన్‌ను సీఎం చేయాలని బీజేపీ ఎత్తులు వేస్తోందని ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ పార్టీలకు వ్యతిరేకంగా పోరాడాల్సిందేనని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

8 Replies to “బాబు, పవన్ మీద పాల్ పంచులు”

  1. ఈయన ట్రంప్తో మాట్లాడి ఒక లక్ష కోట్లు తెచ్చి ఆంధ్ర రాష్ట్రాన్ని కాపడొచ్చు కదా

  2. ప్లే బాయ్ వర్క్ :- ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు

  3. తొమ్మిది, సున్నా,ఒకటి, తొమ్మిది, నాలుగు, ఏడు, ఒకటి, ఒకటి, తొమ్మిది, తొమ్మిది వీసీ

Comments are closed.