మాజీ క్రికెటర్ రాజకీయాల పట్ల ఆసక్తి కలిగిన అంబటి రాయుడు బీజేపీ పట్ల మొగ్గు చూపుతున్నారా అన్నది అంతా తర్కించుకుంటున్నారు. బీజేపీ విద్యార్థి విభాగం అయిన ఏబీవీపీ 43వ రాష్ట్ర స్థాయి మహాసభలు విశాఖలో జరిగాయి. విశిష్ట అతిథిగా హాజరైన అంబటి రాయుడు కాషాయం పార్టీకి అనుకూలంగా వ్యాఖ్యలు చేయడంతోనే ఈ డిస్కషన్ మొదలైంది.
కొన్ని పార్టీలు కుటుంబాల చుట్టూ తిరుగుతాయి, మరికొన్ని పార్టీలు కార్పొరేట్ సంస్థల చుట్టూ తిరుగుతాయని దేశం కోసం పనిచేసే పార్టీ మాత్రం ఒకటి ఉందని ఆయన అన్యాపదేశంగా బీజేపీ ప్రస్తావనను తీసుకువచ్చారు.
“తన ఏడాది రాజకీయ అనుభవంతో ఇవన్నీ చూశాను” అని ఆయన అన్నారు. అంబటి రాయుడు మొదట వైసీపీ వైపు మొగ్గు చూపించారు. ఆ తరువాత జనసేనతో కనిపించారు. ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. ఆయన బీజేపీ వైపు ఆసక్తిగా ఉన్నారా అన్నది చర్చ సాగుతోంది.
అంబటి రాయుడు యువత, విద్యార్థుల గురించి, దేశ భక్తి గురించి కూడా మాట్లాడారు. ఆయన ఆలోచనలు కూడా పంచుకున్నారు. ఆయనకు రాజకీయాల్లో కీలకమైన పాత్ర పోషించాలని ఉంది. సరైన రాజకీయ వేదిక కోసం అన్వేషణ కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో బీజేపీ పట్ల ఆయన మోజు పెంచుకుంటున్నారా అని ఆలోచిస్తున్నారు.
బీజేపీకి కూడా ఏపీలో బలమైన నాయకులు, వివిధ రంగాలలో పేరు ప్రఖ్యాతులు ఉన్న వారి అవసరం ఉంది. దాంతో అంబటి రాయుడు కమల దళం వైపు ఆకర్షించబడుతున్నారా అన్నది హాట్ డిస్కషన్ పాయింట్‌గా ఉంది.
ఇలాంటోడి ని ఎవరు ఎంకరేజి చెయ్యకూడదు….
ప్లే బాయ్ వర్క్ :- ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు
తొమ్మిది, సున్నా,ఒకటి, తొమ్మిది, నాలుగు, ఏడు, ఒకటి, ఒకటి, తొమ్మిది, తొమ్మిది వీసీ
Nilakada leni vyakthi…
First YSRCP next Jenasena annaru..ipudu BJP.
KA Paul party is right option for him.
directionless selfish person
It is of no use.
సీపీఐ లేదా సీపీఐ లో చేరు