పింక్, నామ్ షబానా లాంటి చిత్రాలు చేస్తున్నపుడు అభ్యుదయ భావాలున్న స్త్రీ మాదిరిగా లెక్చర్లు దంచి కొట్టిన తాప్సీ తన టాలెంట్‌ని దక్షిణాది చిత్ర సీమ సరిగా వాడుకోలేదని ఆరోపించింది. చెట్ల వెంట, పుట్టల వెంట పరుగులు తీయించడానికే పరిమితం చేసారంటూ రాఘవేంద్రరావులాంటి దర్శకుడిపై కూడా కామెంట్లు విసిరింది.
హీరోయిన్లు అంటే కేవలం అందాల ప్రదర్శనకే అన్నట్టు ట్రీట్ చేస్తుంటారని, పింక్‌లాంటి సినిమాలు చేస్తే తప్ప ఎవరినీ గుర్తించరని చాలానే మాట్లాడేసింది. అయితే బాలీవుడ్ తనకి గ్లామర్ పాత్రలు ఆఫర్ చేయకపోవడం వల్లే తాప్సీ ఈ లెక్చర్లు దంచి కొట్టిందని తేల్చేస్తూ 'జుడ్వా 2' వస్తోంది. ఇందులో తాప్సీ ఎక్స్పోజింగ్ పీక్స్‌లో వుంది.
కేవలం బికినీల్లో సోయగాలు ప్రదర్శించడమే కాకుండా వరుణ్ ధవన్‌తో వైల్డ్ కెమిస్ట్రీ షేర్ చేసుకుంది. దీంతో అంతా తాప్సీని తిట్టిపోస్తూ వుంటే, ఇది కూడా స్త్రీ అభ్యుదయవాదమే అన్నట్టు సమాధానాలు ఇస్తోంది. ఎంతయినా ఏ ఎండకి ఆ గొడుగు పట్టడంలో తాప్సీని ఎవరూ దాటలేరనే లెవల్లో ఆమె ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తోంది.