వివేకంతో ఆలోచించిన వివేక్ రామస్వామి

అమెరికా ఎన్నికల ప్రచార బరిలో డొనాల్డ్ ట్రంప్ తరపున తన వాగ్ధాటితో ఉర్రూతలూగించిన వక్త.

వివేక్ రామస్వామి. ప్రపంచమంతా వినిపించిన భారతీయ మూలాలున్న అమెరికన్ పేరు. అమెరికా ఎన్నికల ప్రచార బరిలో డొనాల్డ్ ట్రంప్ తరపున తన వాగ్ధాటితో ఉర్రూతలూగించిన వక్త.

రిపబ్లికన్ పార్టీ ఘనమైన ఆధిక్యంతో గెలిచిన తర్వాత ఎలాన్ మస్క్ తో కలిసి వివేక్ ని డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్న్మెంట్ ఎక్స్పెండీచర్ (డోజ్) లో అర్ధ సింహాసనం పొందినవాడు. అంటే అమెరికా ప్రభుత్వ ఆర్ధికాన్ని, ఖర్చుని కంట్రోల్ చేయగలిగే పవర్ఫుల్ పొజిషన్ అది.

మళ్లీ ఆ పేరు ట్రంప్ ప్రమాణస్వీకారం రోజు వినపడింది. ఈసారి ఎలాన్ మస్క్ పక్కన అతను లేడు. డోజ్ సభ్యుడిగా ప్రముఖంగా ఎక్కడా కనపడలేదు. కారణం- వివేక్ డోజ్ ని వదిలేశాడు. ఓహాయో రాష్ట్రం నుంచి గవర్నర్ గా పోటీ చేయాలన్న ఆలోచన తనకి ఉంది కనుక డోజ్ ని, గవర్నర్ గిరిని ఏక కాలంలో నిర్వహించడం కష్టమని ఎలాన్ మస్క్ అతనిని తప్పించాడని టాక్.

కానీ, జరిగింది ఇది కాదు..వివేక్ రామస్వామే తెలివిగా తప్పుకున్నాడు అంటూ మరొక వాదన వినిపిస్తోంది. ఎందుకంటే ఎలాన్ మస్క్ రాజకీయనాయకుడు కాదు. ఆ దిశగా వెళ్లే సరదా అతనికి లేదు. ఎందుకంటే ఆ మార్గంలో స్వేచ్ఛ తక్కువ ఉంటుంది. స్వేచ్ఛని ఎంజాయ్ చేస్తూ పవర్ ని కూడా ఎంజాయ్ చేయాలంటే రాజకీయాల్లో నేరుగా ఉండకుండా రాజకీయాన్ని నడిపే శక్తిగా ఉండాలనుకున్నాడు. అందుకే ఏది పడితే అడి మాట్లాడగలడు..ఏ డ్యాన్సు పడితే ఆ డ్యాన్సు చేయగలడు, హిట్లర్ తరహాలో నాజీ సెల్యూట్ కూడా చేయగలడు. రాజకీయపరమైన ఆలోచనుంటే అవన్నీ చేయకూడదు.

వివేక్ కి రాజకీయంగా ఎదగాలని ఉంది. మస్క్ పక్కన ఉంటే అతని నీడ ఇతనిపై పడుతుంది. పైగా, మస్క్ కి ఏం చేసినా సోలో హీరోగా చెయ్యాలనుంది తప్ప డోజ్ పవర్ ని మరొకరితో షేర్ చేసుకోవడం అతనికి ఇష్టం లేదు. అందుకే చేతులు కాలాక ఆకులు పట్టుకునట్టు కాకుండా వివేక్ తన వివేకాన్ని వాడి ముందుగానే వైదొలిగాడని అంటున్నారు.

అమెరికాలో ఒక రాష్ట్రానికి గవర్నర్ అయితే, ఫెడరల్ లా ని అమలు చేసే బాధ్యతమాత్రమే ఉంటుంది. లా మేకింగ్ లో పెద్దగా ప్రమేయముండదు. సెనేటర్ అయితే లా మేకింగ్ లో భాగస్వామ్యం ఉంటుంది. ఒక్కో రాష్ట్రం నుంచి ఇద్దరు సెనేటర్లు ఉంటారు. గవర్నర్ మాత్రం ఒక్కడే. లా మేకింగ్ పవర్ లేకుండా, లా ని అమలు చేయడమనే బాధ్యత మాత్రం తీసుకుంటే రాజకీయంగా అతనిని జడ్జ్ చేసేందుకు ప్రజలకి పెద్దగా అవకాశముందదు. కనుక ఆ కారణం చేత వివేక్ రామస్వామి తన దృష్టిని గవర్నర్ పదవి మీదనే పెడుతున్నాడు. మంచి వాగ్ధాటి ఉన్నవాడు, ఆకట్టుకునే వక్త, జాతీయ స్థాయిలో పాపులర్ ఫిగర్ కనుక గవర్నర్ కావడానికి అన్ని అర్హతలు ఉన్నాయనే రాజకీయ విశ్లేషకుల భావన.

దీనికి తోడు మరొక కారణం కూడా ఉంది. ఎలాన్ మస్క్ దూకుడు వివేక్ ని కలవరపరిచింది. ట్రంప్ గెలిచీ గెలవగానే ఇంటెల్ మీద, క్రోం మీద కన్నేసాడు ఎలాన్ మస్క్. తనకి నచ్చినవి తనవద్దకు వచ్చేయాలి, లేకపోతే రాజకీయశక్తితో ఆ వ్యాపారాలని ధ్వంసం చేసే మూడ్ లో ఉన్నట్టుగా కనిపిస్తున్నాడు. అటువంటి వ్యక్తితో అంటకాగితే వివేక్ రామస్వామి చాలామంది పారిశ్రామిక, వ్యాపారవేత్తలని శత్రువులుగా చేసుకోవాల్సి వస్తుంది. అది అతని రాజకీయ భవిష్యత్తుకి మంచింది కాదు.

రాజకీయం వేరు, వ్యాపారం వేరు. రెండు రంగాలు పరస్పర లాభం కోసం పని చేస్తే పర్వాలేదు కానీ, రాజకీయం వ్యాపారాన్ని మింగేస్తానంటే, అలాంటి రాజకీయం ఎన్నోనాళ్లు ఉండదు. బిజినెస్ క్లాస్ నుంచి తిరుగుబాటు మొదలవుతుంది.

ఒక్క మాటలో చెప్పాలంటే, మస్క్ కి ఓటర్లు అవసరం లేదు, వివేక్ కి అవసరం ఉంది. అందుకే మస్క్ కి దూరంగా ఉండడాలనుకోవడం వివేకవంతమైన ఆలోచన.

పద్మజ అవిర్నేని

16 Replies to “వివేకంతో ఆలోచించిన వివేక్ రామస్వామి”

    1. Vivek primaries lo munde chetulettesi Trump ki selute kottadu.
    2. Vivek di vagdhati kaadu pichi vagudu.
    3. Vivek ki president ga poti chese avakasam mari konni dasabdalaki ledu. Avakasam raadu.
    4. Governer ga matrame prayatninche avakasam undi. Idi kuda gelavadam anta suluvu kaadu.
    5. Trump aasirvadam adukkoni ippudu Ohio ki try chesukuntunnadu.
    1. తమ్ముడూ నువ్వు తెలుసుకోవాల్సింది:

      వివేక్ అసలు ఏరోజూ సీరియస్ ప్రెసిడెన్షియల్ కాండిడేట్ కాదు. ఆ ప్రైమరీ డిబేట్స్‌కి ట్రంప్ దూరంగా ఉన్నాడు కాబట్టి వివేక్‌ని వాడుకున్నాడు. వివేక్ తను కూడా సీరియస్ కాండిడేట్‌లాగా నటిస్తూ డిబేట్‌కి అప్పటికి ట్రంప్ ప్రధాన ప్రత్యర్థి నిక్కీ హేలీని, ఆమె చమ్చా క్రిస్ క్రిస్టీని ఉతికి ఆరేసాడు. పని పూర్తవ్వగానే తన కాంపెయిన్ మానేసి ట్రంప్ పక్కన నుంచున్నాడు. ప్రతి రిపబ్లికన్ ప్రైమరీ డిబేట్స్‌లో ఇలాంటి ప్రాక్సీ కాండిడేట్స్ ఉండటం మామూలే. (2016లో క్రిస్టీ ట్రంప్ చమ్చాగా ఉంటూ మార్కో రూబియోని ఉతికి ఆరేసాడు. ఈరోజు రూబియో ట్రంప్ కాబినెట్‌లో ఉన్నాడు).

      వివేక్‌కి ప్రెసిడెంట్‌గా పోటీ చేసే అవకాశం దశాబ్దాలు కాదు, అసలు ఈ జీవితం మొత్తం రాదు. రిపబ్లికన్ పార్టీయా మజాకా?

      ఒహాయో గవర్నర్ రెండు టరంస్ 2026లో పూర్తవుతాయి. అతను ఇక పోటీ చెయ్యలేడు. అతని స్థానం భర్తీ చేస్తాడనుకున్న లూటినెట్ గవర్నర్ జోన్ హస్టెడ్ జేడీవాన్స్ ఖాళీ చేసిన స్థానంలో సెనేటర్‌గా వెళుతున్నాడు. అందుకే అక్కడ ఖాళీ ఉంది. ట్రంప్ తన మనిషిని అక్కడ పెడతాడు, దానికోసం వివేక్ ప్రయత్నిస్తున్నాడు. దీనిలో అడుక్కోవడమేంటో తెలుగు మాటలు ఇంగ్లీష్‌లో టైపు కొట్టుకునే నువ్వే చెప్పాలి.

      1. 😀. ఆదిపర్వంలో ఆగిన ఆలోచనను, విరాటపర్వం లో లీనం చేయడం కష్టం. But good attempt.

  1. ప్లే బాయ్ వర్క్ :- ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు

  2. తొమ్మిది, సున్నా,ఒకటి, తొమ్మిది, నాలుగు, ఏడు, ఒకటి, ఒకటి, తొమ్మిది, తొమ్మిది వీసీ

Comments are closed.