హీరో కళ్యాణ్ రామ్ సినిమా అంటే బ్యానర్ ఏంటీ అని అడగక్కర్లేదు. ఎందుకంటే దాదాపు ఆయన చేసినవి అన్నీ స్వంత బ్యానర్ పైనే. వాటిల్లో డబ్బులు వచ్చిన వాటి కంటే పోయినవే ఎక్కువ. అయితే ఆర్థికంగా కళ్యాణ్ రామ్ బలంగా వుండి వుండొచ్చు.
కానీ సినిమాల్లో లాస్ అయినదే ఎక్కువ. ఇప్పుడు తమ్ముడు ఎన్టీఆర్ తో జైలవకుశ చేస్తున్నారు. దాదాపు నలభై కోట్లకు పైగానే మిగిలే చాన్స్ వుంది. ఎందుకంటే సినిమాకు మహా అయితే 60కోట్లకు మించి కాదు. బిజినెస్ వంద కోట్ల వరకు వుంటుంది. అన్నీ కలుపుకుని.
ఇదిలా వుంటే ఇప్పుడు కళ్యాణ్ రామ్ రెండు సినిమాల్లో హీరోగా చేస్తున్నారు. రెండూ బయటి బ్యానర్లే. ఇకపై మాంచి పవర్ ఫుల్ సబ్జెక్ట్, అది కూడా క్రేజీ కాంబినేషన్ అనిపిస్తేనే కళ్యాణ్ రామ్ బ్యానర్ పై సినిమా వుంటుందని తెలుస్తోంది. ఈ మేరకు ఎన్టీఆర్ అన్నకు సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఇన్నాళ్లు పోయింది, జై లవకుశ తో రికవరీ అయిపోతుంది. అందువల్ల ఇకపై ఏదో ఒక ప్రాజెక్టు చేయాలి కదా అని చేసి, డబ్బులు పోగొట్టుకునే పని చేయవద్దని కళ్యాణ్ రామ్ కు ఎన్టీఆర్ సలహా ఇచ్చాడని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. సలహా మంచిదే. పాటిస్తే ఇంకా మంచిదే.