మళ్లీ జంక్షన్లో అల్లు అర్జున్?

అల్లుఅర్జున్ 'నా పేరు సూర్య' నా ఇల్లు ఇండియా సినిమా షూట్ చకచకా సాగిపోతోంది. వక్కంతం వంశీ డైరక్షన్ లో సినిమా ముస్తాబయిపోతోంది. విడుదల ఎప్పుడన్నది పక్కన పెడితే మహా అయితే మరో మూడు,…

అల్లుఅర్జున్ 'నా పేరు సూర్య' నా ఇల్లు ఇండియా సినిమా షూట్ చకచకా సాగిపోతోంది. వక్కంతం వంశీ డైరక్షన్ లో సినిమా ముస్తాబయిపోతోంది. విడుదల ఎప్పుడన్నది పక్కన పెడితే మహా అయితే మరో మూడు, నాలుగు నెలల్లో బన్నీ ఖాళీ అయిపోతాడు. అప్పుడేంటీ అన్నది సమస్య. బన్నీ ఊ అనాలే కానీ సినిమాలకు కొదవేంటీ అన్నది నిజమే. కానీ ఇప్పటికి అయితే బన్నీ ఓకె చేసిన సినిమాలు ఏవీలేవు. లింగుస్వామి డైరక్షన్ లో ఓ సినిమా చేయాలని డిసైడ్ అయ్యారు. కానీ దానికి ఇంకా రంగు, రూపు ఇతరత్రా వ్యవహారాలు రాలేదు. 

మరోపక్క లింగుస్వామి హీరో విశాల్ కాంబినేషన్ లో పందెం కోడి 2 అన్నమాట వినిపిస్తోంది. అది ఇప్పుడే వుంటుందని వార్తలు అయితే వున్నాయి. కానీ ఇంకా పూర్తిగా పట్టాలు ఎక్కలేదు. మరి ఇప్పుడు స్టార్ట్ అయితే ఎప్పటికి పూర్తవుతుందన్నది తెలియదు. గతంలో సన్నాఫ్ సరైనోడు తరువాత బన్నీకి ఇలాగే గ్యాప్ వచ్చింది. త్రివిక్రమ్ వస్తారు అనుకుంటే రాలేదు. దాంతో చేయడానికి చేతిలో రెడీగా స్క్రిప్ట్ వున్న డైరక్టర్ దొరకలేదు. ఇక ఆఖరికి, హరీష్ శంకర్ తో డిజె సినిమాకు దిగారు. 

ఇప్పుడు మరోసారి మళ్లీ అలాంటి పరిస్థితే వచ్చేలా వుంది? లింగుస్వామి కనుక ఒకటి రెండు నెలల గ్యాప్ తో రాకపోతే, బన్నీకి రెడీగా సినిమా వుండదు. తెలుగులో బన్నీకి సూటయ్యే డైరక్టర్ కూడా లేరు. బాబీ అందుకోసమే ఇటీవల ఓసారి బన్నీని కలిసింది. కానీ బాబీకి చాన్స్ అన్నది జై లవకుశ మీద ఆధారపడి వుంటుంది. మిగిలిన వారిలా రెండు, మూడు సినిమాలు లైన్ లో వుంచుకోవడంలో బన్నీ ఎందుకో విఫలమవుతున్నారు. 

నిజానికి విజయం సాధించిన ప్రతి డైరక్టర్ ను మనం సినిమా చేద్దాం, అంటూ చెప్పడం బన్నీకి అలవాటు. చందు మొండేటికి చెప్పారు. అర్జున్ రెడ్డి డైరక్టర్ కు చెప్పారు. కానీ చేయడం కనిపించదు. ఇలా అందరికీ చెబుతుంటే, మిగిలిన డైరక్టర్లు వేరే హీరోలను చూసుకుంటున్నట్లు కనిపిస్తోంది. మొత్తానికి బన్నీ తన ప్లానింగ్ కాస్త మార్చుకోవాలేమో?