ఆ సినిమా ‘ఆది’ కొంటుందా?

యామిరిక్కు భయమే. ఈ సినిమా తమిళంలో వచ్చి మూడేళ్లయిపోయింది. ఆ డీవీడీని తెలుగులో చూపించని హీరో లేడు. అల్లరి నరేష్ నుంచి నిఖిల్, సునీల్ ఇలా అందరికీ చూపించారు. కానీ ఎవ్వరూ చేయలేదు. కారణం…

యామిరిక్కు భయమే. ఈ సినిమా తమిళంలో వచ్చి మూడేళ్లయిపోయింది. ఆ డీవీడీని తెలుగులో చూపించని హీరో లేడు. అల్లరి నరేష్ నుంచి నిఖిల్, సునీల్ ఇలా అందరికీ చూపించారు. కానీ ఎవ్వరూ చేయలేదు. కారణం మరేం లేదు. ఆ సినిమాలో హీరోయిజం అన్నది పాయింట్ ఫైవ్ పర్సంట్ కూడా వుండదు. పైగా కథ జస్ట్ అలా అలా వచ్చి వెళ్లిపోతున్నట్లు వుంటుంది. సినిమా క్లయిమాక్స్ మనవాళ్లకు రుచించేలా వుండదు. 

ఆ కథకు మార్పులు చేర్పులు చేయించారు ఈటీవీ ప్రభాకర్ చేత. ఫ్లాపుల్లో వున్న ఆది సాయికుమార్ ఆ సినిమాకు ఓకె చెప్పాడు. నెక్స్ట్ నువ్వే అనే టైటిల్ తో స్టార్ట్ చేసిన ఆ సినిమా ఇప్పుడు దాదాపు పూర్తయిపోయింది. గీతా ఆధ్వర్యంలో కాబట్టి, ఆచి తూచి, వేచి, టైమ్ చూసి వదుల్తారు సినిమాను. ఇప్పుడు ఆ సినిమా మీదే ఆది సాయికుమార్ ఆశలన్నీ. శమంతకమణి కాస్త ఆదుకుంటుంది అనుకుంటే తెచ్చిపెట్టింది ఏమీ లేదు.

హర్రర్ కామెడీ జోనర్ కాబట్టి, ఈటీవీ ఫ్రభాకర్ సినిమా బ్రేక్ ఇస్తుందేమో అనుకుంటున్నాడు ఆది. నిజానికి ఆదితో పాటు ఈటీవీ ప్రభాకర్ ఆశలు కూడా దీనిపైనే. ఎందుకంటే చిన్న స్క్రీన్ మీద నుంచి పెద్ద స్క్రీన్ మీదకు రావాలన్న ప్రభాకర్ ఆశలు ఈ సినిమాతో తీరతాయి. కానీ నిలదొక్కుకోవాలి, మరో మంచి ప్రాజెక్టు పట్టాలి అంటే ఈ సినిమా హిట్ అయి తీరాలి. అప్పుడే నెక్స్ట్ నువ్వే అంటూ ఇద్దరికి ఎవరైనా చాన్స్ ఇచ్చేది.