కొబ్బరి మట్టకు ఎంతకాలం? ఎన్ని కోట్లు?

సంపూర్ణేష్ బాబు తొలి సినిమా హృదయకాలేయం తరువాత ప్రకటించిన సినిమా కొబ్బరిమట్ట. ఆ తరువాత సంపూ సినిమాలు ఎన్నో వచ్చాయి. వెళ్లాయి. పైసలు వచ్చాయా లేదా అన్నది జనాలకు తెలిసిందే. అయితే కొబ్బరి మట్ట…

సంపూర్ణేష్ బాబు తొలి సినిమా హృదయకాలేయం తరువాత ప్రకటించిన సినిమా కొబ్బరిమట్ట. ఆ తరువాత సంపూ సినిమాలు ఎన్నో వచ్చాయి. వెళ్లాయి. పైసలు వచ్చాయా లేదా అన్నది జనాలకు తెలిసిందే. అయితే కొబ్బరి మట్ట మాత్రం సిద్ధం కాలేదు.

ఈలోగా సంపూ బాబు క్రేజ్ రోజు రోజుకు తగ్గుతూ వచ్చింది. ఇప్పుడు సంపూ చేతిలో ఏ సినిమాలు వున్నాయన్నది తెలియదు కానీ, ఈ కొబ్బరి మట్టకు మాత్రం ఏకంగా కోటిన్నర వరకు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.

ఫినిష్ చేయడానికి ఇంక ఎంత అవసరం అవుతున్నది, ఎప్పుడు ఫినిష్ అవుతుందన్నది తెలియదు కానీ, సంపూపై ఇంత ఖర్చు చేయడం అన్నది అవసరమా? లాభదాయకమా అన్నది మాత్రం నిర్మాతలకే తెలియాలి. హృదయకాలేయం అన్నది వేరు.

ఆ టైమ్ లో సోషల్ మీడియాలో కలిగిన ఆసక్తితో అది నడచిన తీరు వేరు. నిజానికి కొబ్బరిమట్టకు కూడా ఆ మధ్య సోషల్ మీడియాలో కాస్త హడావుడి వచ్చింది. కానీ ఇన్ టైమ్ లో రెడీ చేసుకుని విడుదల చేసుకోవడం నిర్మాతలకు వీలుకాలేదు. ఇప్పటికి కోటిన్నరకు పైగా పెట్టినట్లు తెలుస్తోంది. మరి సంపూ బాబు సినిమా నిర్మాతలను ఏం చేస్తుందో చూడాలి.