పవన్ అవకాశాలు దెబ్బతీసిన ప్రజారాజ్యం

పవన్ కళ్యాణ్ మరో స్టెప్ ముందుకు వేసారు. జనసేనకు సోషల్ మీడియా సపోర్ట్ కోసం ఆయన పావులు కదుపుతున్నారు. సోషల్ మీడియాలో ఏక్టివ్ గా వుండే కొంత మంది యువతతో పవన్ సమావేశమై, జనసేన…

పవన్ కళ్యాణ్ మరో స్టెప్ ముందుకు వేసారు. జనసేనకు సోషల్ మీడియా సపోర్ట్ కోసం ఆయన పావులు కదుపుతున్నారు. సోషల్ మీడియాలో ఏక్టివ్ గా వుండే కొంత మంది యువతతో పవన్ సమావేశమై, జనసేన సోషల్ మీడియా గ్రూప్ కు శతృఘ్ని అని పేరు కూడా పెట్టారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా కుర్రాళ్ల ప్రశ్నలకు పవన్ సమాధానాలు ఇలా వున్నాయి.

ప్రజారాజ్యం ఫెయిల్యూర్ అన్నది జనసేనకు, నాకు సమస్యగా మారింది. ప్రతి విషయంలో నమ్మకం నిరూపించుకోవాల్సి వస్తోంది. 

కాంగ్రెస్ పార్టీ బలంగా మారడానికి బోలెడు ఏళ్లు పట్టింది. నేను అయితే జనసేన కానీ, నేను కానీ ఓ స్థాయికి చేరడానికి పాతికేళ్ల ప్రయాణం చేయాల్సి వుంటుంది అనుకుంటూ దానికి సిద్దం అవుతున్నాను.

2018 ఆఖరకు కానీ ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తాను అన్నది చెప్పలేను. అక్టోబర్ నుంచి జనంలోకి వెళ్లిన తరువాత అసలు సంగతి తెలుస్తుంది. తెలంగాణలో యూత్ బలంగానే వున్నారు కానీ, సొసైటీ సమస్యల మీద మాట్లాడడానికి సిద్ధంగా లేరు. లోకల్ బిగ్ లెవెల్ సపోర్టు లేకపోతే, క్యాడర్ ఇబ్బంది పడతారు. ఒకరిద్దరు వుంటే సరిపోదు. ఇబ్బంది పడతారు. అందుకే తెలంగాణలో నేను ముందుకు వెళ్లకలేకపోతున్నాను.

అన్నీ నేను చేయలేను. కొంత వరకే పోరాడగలను. కానీ జాతీయ స్థాయిలో వున్న కాంగ్రెస్, వామపక్షాలు ఏం చేస్తున్నాయి. అగ్రిగోల్డ్ ఇస్యూను చేయాలని నాకు వుంది. కానీ నాకు పరిమితులు వున్నాయి. మరి ఆ పార్టీలు ఎందుకు చేయవు. స్పెషల్ స్టేటస్ పై ఫైట్ చేసాను. అప్పుడు ప్యాకేజ్ ఇచ్చారు. దానిపై ప్రశ్నించాను. నిజానికి ఈ సమస్య మీద వైకాపా అసెంబ్లీలో మాట్లాడవచ్చు. నేను చేయాలంటే నాకు అంత ఆర్గనైజేషన్ లేదు. టైమ్ పడుతుంది. ఆలోచనలో ఆపను. కార్యక్రమాల్లో ఆపక తప్పడం లేదు.

రాయడానికి ఇలా అయితే బాగానే వుంది కానీ పవన్ ఇంట్రాక్షన్ విడియో చూస్తుంటే, సమాధానాలు సూటిగా చెప్పడానికి పవన్ ఎంత జాగ్రత్తగా మాట్లాడాల్సి వచ్చిందో అన్నది క్లియర్ గా తెలుస్తోంది.

మీరు ఫైట్ చేయడం లేదేంటే అంటే, నా కన్నా బలమైన వాళ్లు కదా? వాళ్లు చేయాలి కదా అని ఎదురు ప్రశ్నిస్తే ఎవరైనా ఏమనుకుంటారు? అలాంటపుడు తనెందుకు ముందుకు రావడం, వాళ్లకు వదిలేయ వచ్చు కదా? అలాగే 2018 చివరకు కానీ తన బలం అసెస్ చేసుకుని, పోటీ చేసే స్థానాల గురించి చెప్పలేనని చెప్పడం కూడా చిత్రంగా వుంది. ఒకటి మాత్రమే పవన్ క్లియర్ గా చెప్పారు. ప్రజారాజ్యం వైఫల్యం ప్రభావం జనసేన మీద వుందని.