రామ్ చరణ్ తో బోయపాటి?

బోయపాటితో సినిమా చేయాలని అందరు హీరోలకు ఇంట్రెస్ట్ వుంటుంది. కానీ టైమ్, కథ సెట్ కావాలి. అయితే బోయపాటికి పర్టిక్యులర్ గా మెగా హీరోతో సినిమా చేయాలని వుందన్నది వాస్తవం. బాలయ్యతో సినిమా చేసే…

బోయపాటితో సినిమా చేయాలని అందరు హీరోలకు ఇంట్రెస్ట్ వుంటుంది. కానీ టైమ్, కథ సెట్ కావాలి. అయితే బోయపాటికి పర్టిక్యులర్ గా మెగా హీరోతో సినిమా చేయాలని వుందన్నది వాస్తవం. బాలయ్యతో సినిమా చేసే లోగా ఓ సినిమా మెగా హీరోతో చేయాలని ఆయన అనుకున్నారు.

కానీ అల్లు అరవింద్ తో ఒప్పందం ప్రకారం చిరంజీవితో చేయాల్సి వుంది. దానికి స్క్రిప్ట్ రెడీ. అయితే చిరు ఇప్పుడు సై..రా సినిమాపై బిజీగా వున్నారు. మరో ఏడాదికి పైగానే పడుతుంది ఆయన ఖాళీ కావాలంటే.

అందుకే ఈ లోగా రామ్ చరణ్ తో సినిమా చేయాలని బోయపాటి ఆలోచిస్తున్నారని వార్తలు బయటకు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం చరణ్ చేస్తున్న సుకుమార్ సినిమా జనవరి నాటికి ఫినిష్ అవుతుంది. చెర్రీ ఓకె అంటే బోయపాటి ఇప్పటి నుంచీ స్క్రిప్ట్ పని మీద వుంటారు. అయితే ఓకె చెప్పడానికి చెర్రీతో బోయపాటి ఓ సిటింగ్ వేయాల్సి వుంది.

ఇదిలా వుంటే చరణ్ తో బోయపాటి సినిమా అన్నది బయటకు పొక్కగానే ఇద్దరు బడా ప్రొడ్యూసర్లు ఆసక్తి కనబర్చడం స్టార్ట్ చేసారట. ఒకరు ధృవ సినిమాను చరణ్ కోరిక మేరకు వదులుకున్న డివివి దానయ్య. రెండవది బన్నీకి డిజె సినిమా ఇచ్చిన దిల్ రాజు. ఇద్దరూ తాము రెడీ అన్న సిగ్నళ్లు అటు చరణ్ కు ఇటు బోయపాటికి పంపించినట్లు వినికిడి. మరి ఎప్పుడు ఫైనల్ అవుతుందో ఈ క్రేజీ ప్రాజెక్టు?