‘భరత్’ కు భారీ రేటు?

భరత్ అనే నేను సినిమా చకచకా రెడీ అవుతోంది. ఈ సినిమా సెట్ మీద వుండగానే మార్కెట్ మొదలయిపోయింది. ఓవర్ సీస్ లో నిర్మాత కోట్ చేస్తున్న 18కోట్ల రేట్ కు బాగానే స్పందన…

భరత్ అనే నేను సినిమా చకచకా రెడీ అవుతోంది. ఈ సినిమా సెట్ మీద వుండగానే మార్కెట్ మొదలయిపోయింది. ఓవర్ సీస్ లో నిర్మాత కోట్ చేస్తున్న 18కోట్ల రేట్ కు బాగానే స్పందన వచ్చినట్లు తెలుస్తోంది.

అదే సమయంలో వరల్డ్ వైడ్ థియేటర్ హక్కుల కోసం అవుట్ రేట్ ఫస్ట్ కాపీ మీద కొనడానికి ఆఫర్లు వస్తున్నట్లు తెలుస్తోంది. ఆంధ్ర, తెలంగాణ కలిపి ఎలా లేదన్నా 80కోట్ల వరకు థియేటర్ రైట్స్ వుండే అవకాశం వుంది. స్పైడర్ కు 70కి పైగానే వచ్చింది. దీనికి డైరక్టర్ పేరు ఏడ్ అవుతుంది కాబట్టి 80దాటే అవకాశం వుంది.

ఇక కర్ణాటక, తమిళనాడు, బాలీవుడ్, ఓవర్ సీస్ కలిపి మరో నలభై నుంచి యాభై వరకు వచ్చే అవకాశం వుంటుంది. అందువల్ల కొంత మంది 115వరకు అవుట్ రేట్ ఆఫర్ ను నిర్మాత దానయ్య ముందు వుంచారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇలా ఆఫర్ అందించిన వారిలో ఆసియన్ సునీల్ గ్రూప్ కూడా వుందని తెలుస్తోంది.

కానీ ఇప్పటికి అయితే నిర్మాత దానయ్య ఏమీ చెప్పేలేదు. ఈ ఆఫర్ లు కూడా ఎర్లీ స్టేజ్ లో వున్నాయి. సీరియస్ డిస్కషన్ స్టేజ్ కు వస్తే అప్పుడు రేటు, దాని రూటు తెలుస్తుందేమో?

మిర్చి, శ్రీమంతుడు, జనతాగ్యారేజ్ ల తరువాత దర్శకుడు కొరటాల శివ అందిస్తున్న పొలిటికల్ బ్యాక్ గ్రవుండ్ సినిమా ఇది. అందువల్ల మంచి క్రేజ్ నే వుంది దీనికి.